Suryaa.co.in

Andhra Pradesh

ఇంత దిగజారిపోవాలా జగన్‌?

అక్కచెల్లెమ్మలంటూనే అనుచిత వ్యాఖ్యలా?
మిమ్మల్ని మించిన సైకోలెవరుంటారు?
నిన్ను చూసి చెల్లెళ్లే భయపడుతున్నారని తెలీదా?
పిఠాపురంలో జగన్‌ వాఖ్యలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ధ్వజం

ఎన్నికలలో ఓటమి కళ్లముందు కనిపిస్తుండటంతో.. భయాందోళనకు గురవుతున్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నైతిక విలువలను గాలికి వదిలేసి విపక్షాలపై దిగజారుడు దూషణలకు దిగుతున్నాడు. శనివారంనాటి పరిణామాల్లో పిఠాపురం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన సీఎం జగన్‌, విపక్ష శిబిరంలోని జనసేన అగ్రనేత, పిఠాపురం అసెంబ్లీ కూటమి అభ్యర్థి పవన్‌ కల్యాణ్‌పై వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సిగ్గుచేటు.

అదే సమయంలో రాష్ట్ర మహిళల శీలాన్ని శంకించేలా బహిరంగ వేదికలపై ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం జగన్‌ నైతికంగా ఎంత దిగజారిపోయాడో అర్థం చేసుకోదగ్గదే. ‘పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత జీవితాన్ని పదేపదే ప్రస్తావించడం ద్వారా ఆయన ఆత్మ స్థయిర్యాన్ని దెబ్బతీయాలన్న కుట్రతో జగన్‌ చేస్తున్న వ్యాఖ్యలు.. ముఖ్యమంత్రి పీఠానికే అవమానకరం. జగన్‌ తన సహజ నేర స్వభావాన్ని పదేపదే బయటపెట్టుకుంటూ.. ప్రత్యర్థిని దూషించడానికి అక్కచెల్లెమ్మల సౌశీల్యంపైనా అనుచిత వ్యాఖ్యలకు దిగడం ముఖ్యమంత్రి హోదాను అగౌరవపర్చడమే.

ముఖ్యమంత్రిస్థాయికి తాను తగనని అనేక సందర్భాల్లో బయటపెట్టుకుంటున్న జగన్‌ `చట్టబద్ధంగా సాగిన పవన్‌ వైవాహిక జీవితంపై చెత్త వ్యాఖ్యలు చేయడాన్ని రాష్ట్ర ప్రజలు ఈసడిరచుకుంటున్నారు. అసలు మహిళలను అవమానించే హక్కు ముఖ్యమంత్రికి ఎవరిచ్చారన్నదే ప్రశ్న. ముఖ్యమంత్రిస్థాయి వ్యక్తి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మహిళలను కించపర్చేలా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించాలి. నిబంధనల మేరకు ముఖ్యమంత్రి జగన్‌పై చర్య తీసుకుని.. రాష్ట్ర మహిళను గౌరవించాలి.

LEAVE A RESPONSE