Suryaa.co.in

Andhra Pradesh

సొంత ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి అమర్

విశాఖపట్నం, జూన్ 20: తన సొంత నియోజక వర్గ మైన అనకాపల్లిలో స్వగృహ నిర్మాణానికి మంత్రి అమర్ నాథ్ శ్రీకారం చుట్టారు. అనకాపల్లి గాంధీ నగర్లో నిర్మించనున్న ఈ ఇంటికి మంత్రి అమర్ నాథ్ సతీసమేతంగా సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ ఇంటి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి తన క్యాంప్ కార్యాలయాన్ని అనకాపల్లికి తరలించాలని అమర్ భావిస్తున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ b.v. సత్యవతి, అనకాపల్లి నియోజక వర్గ ప్రముఖులు, నాయకులు, పెద్దయెత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.Whats-App-Image-2022-06-20-at-12-35-44-PM-1

LEAVE A RESPONSE