– 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా పవన్ కల్యాణ్..?
– ముందు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి.
– బాబు-పవన్ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు
– నీ ఎదుగుదలకు కారణమైన చిరంజీవి తమ్ముడినని ఏనాడైనా చెప్పావా పవన్..?
– చిరంజీవి-జగన్ గార్లు సొంత అన్నదమ్ముల్లా ఉంటారు.. అందుకు నేనే సాక్ష్యం
– పవన్ – బాబులను అమిత్ షా కలవలేదంటేనే.. వీళ్ళ స్థాయి ఏంటో తెలుసుకోవాలి
– రంగా హత్యలో బాబుకు సంబంధం లేదని ఏ ఒక్కరితోనైనా చెప్పించగలవా పవన్ కల్యాణ్..?
– కాపులకు ఇంత అన్యాయం చేసిన బాబు కు ఊడిగం చేసే పవన్ ను కాపులెవరూ నమ్మరు
– రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా
మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. ఏమన్నారంటే…
మీరెంతమంది వచ్చినా.. జగన్ ని టచ్ చేయలేరు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో తీసుకువచ్చిన భారీ సంస్కరణలు- కనీవినీ ఎరుగని రీతిలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాని ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ద్వారా ప్రజలు దగ్గరకు వెళితే అనూహ్య స్పందన కనిపిస్తోంది. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూశాక, ప్రజా ప్రతినిధులుగా మాకు మరింత ప్రోత్సహకంగా, చాలా సంతోషంగా ఉంది.
ఒక రూపాయి అవినీతి లేకుండా, రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రజల నుంచి వచ్చే ఈ స్పందన చూసి ఓర్చుకోలేని, తట్టుకోలేని ప్రతిపక్షాలు, మా ప్రభుత్వంపై రకరకాల కుట్రలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టను దిగజార్చేందుకు ఒకవైపు ఎల్లో మీడియా.. మరోవైపు చంద్రబాబు అండ్ కో.. నిత్యం ఏదోరకంగా బురదచల్లుతూనే ఉన్నాయి.
గతంలో స్వర్గీయ ఎన్టీఆర్‌ని మొదటిసారి నాదెండ్ల భాస్కర్‌రావు వెన్నుపోటు పొడిచాడు. అప్పటికీ ఎన్టీఆర్ జాగ్రత్తగా ఉండకపోవడంతో రెండోసారి నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు, “నారా-నాదెండ్ల” కుమ్మక్కై పవన్ కల్యాణ్ అనే శిఖండిని కలుపుకుని, జననేత అయిన జగన్‌గారిని ఏదో రకంగా వెన్నుపోటు పొడుద్దామనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే చిల్లర రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు. మీ ముగ్గురు కాదు కదా… మీలాంటి వాళ్లు మూడు వందల మంది వచ్చినా.. వైఎస్ జగనన్న ప్రజా బలం ముందు ఆయన్ను మీరు కనీసం టచ్ చేయను కూడా చేయలేరు.
చిరంజీవి-జగన్ అన్నదమ్ముల్లా ఉంటారు.. అందుకు నేనే సాక్ష్యం
చిరంజీవిగారిని జగన్ ఏదో అవమానించారని పవన్ కల్యాణ్ అబద్ధాలు మాట్లాడుతున్నాడు. చిరంజీవిగారు- జగన్‌గారు ఎంత ఆప్యాయంగా ఉంటారో అందుకు నేనే ప్రత్యక్ష సాక్ష్యం. గతంలో అయన ఇంటికి వచ్చినప్పుడు అయినా, ఇటీవల భీమవరం కార్యక్రమంలో అయినా వారిద్దరూ ఎంతో ఆప్యాయంగా సొంత అన్నదమ్ముల్లా ఉంటారనేది దగ్గరుండి నేను చూశాను. ఎప్పుడూ పవన్ కల్యాణ్, తాను కానిస్టేబుల్ కొడుకునని చెప్పుకుంటాడు తప్పితే, అతను ఈ స్థాయికి రావడానికి కారణమైన చిరంజీవి సోదరుడిని అని ఎప్పుడూ చెప్పుకున్నట్లు కనిపించలేదు.
నీ వల్లే చిరంజీవికి అవమానం
రాజకీయాల్లోగానీ, సినిమాల్లో గానీ చిరంజీవి ఎప్పుడూ అవమానపడలేదు. అవమానం అంటూ జరిగితే అది పవన్ కల్యాణ్ వల్లే జరిగింది. అది ఎప్పుడంటే.. పరిటాల రవి నీకు గుండు కొట్టించినప్పుడు, చిరంజీవిగారు చంద్రబాబును కలవడానికి వస్తే, అధికారమదంతో ఆరోజు చంద్రబాబు-పరిటాల రవి లు కలిసి చేసిన అవమానమే.. చిరంజీవిగారి జీవితంలో పెద్ద అవమానం. నీ గుండు ఎపిసోడ్‌లో మాత్రమే చిరంజీవిగారికి అవమానం జరిగింది. మెగాస్టార్ గా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన చిరంజీవిగారిని ఎవరూ అవమానించలేదు. తాజాగా ఆయన పుట్టినరోజున(ఆగస్టు 22న) మళ్లీ పవన్ కల్యాణే.. అటువంటి మాటలు మాట్లాడి ఆయనకు అవమానం చేశాడు.
మళ్ళీ సవాల్ విసురుతున్నాం.. నీకు ఆ దమ్ముందా..?
పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో 175కు, 25 పార్లమెంట్ స్థానాల్లో 25కు పోటీ చేసే దమ్ము ఉందా..? అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తోంది. నీకు ఆ దమ్ములేదు. చంద్రబాబు నాయుడు చెబితే తప్ప, జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో చెప్పలేని పరిస్థితి పవన్ కల్యాణ్‌ది. అలాంటి నువ్వు మాపై విమర్శలు చేయడంలో అర్థంలేదు. ఈ రాష్ట్ర ప్రజలు పవన్ కల్యాణ్- చంద్రబాబు విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మీ ఎజెండా ఏమిటో ప్రజలకు అర్థం అయింది కాబట్టి.
రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాలు, పేద ప్రజలంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు, ఉంటారు. వైయస్సార్ సీపీకి ఏదైనా అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు.. ఒక అమ్మ ఒడి, ఒక విద్యా దీవెన, ఒక ఆరోగ్యశ్రీ, 31 లక్షల ఇళ్ల మంజూరు… ఇలా దాదాపు 40 పథకాలకు పైగా కుంటుపడతాయని రాష్ట్ర ప్రజలంతా జగన్ మోహన్ రెడ్డిగారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. అయితే ఈ సంక్షేమ పథకాలను ఏదోరకంగా ఆపాలనే దురుద్దేశంతో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు అయిన పవన్ కల్యాణ్ లు వైయస్సార్ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకుంటున్నారు. వారి కల ఎప్పటికీ నెరవేరదు.
మరి, మిమ్మల్నెందుకు అమిత్ షా కలవలేదు..?
నువ్వు పెద్ద పుడింగి అని ఫీల్ అయిపోతుంటావు కదా? నిన్నగాక మొన్న అమిత్ షా గారు హైదరాబాద్ వచ్చారు. మరి నువ్వు పెద్ద పుడింగివే అయితే, ఆయన నీ దగ్గరకు వచ్చి కలిసేవాళ్లు కదా?. కానీ జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయి వెళ్ళారు. అలానే అమిత్‌షా రామోజీ ఫిల్మ్‌సిటీకి వస్తారు.. రామోజీరావుతో పాటు చంద్రబాబుతో భేటీ అవుతారని ఎల్లో మీడియాలో వారం రోజులపాటు రకరకాలుగా వార్తలు ప్రచారం చేసుకున్నారు. అమిత్ షా రామోజీ ఫ్మిల్‌సిటీకి అయితే వచ్చారు కానీ, మరి చంద్రబాబు నాయుడు ఎక్కడా కనిపించలేదేం..?. పవన్ కల్యాణ్ లా, చంద్రబాబుకు కూడా సిగ్గులేదు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకేరోజు ప్రధానమంత్రి తో పాటు భారత రాష్ట్రపతిని కూడా కలిశారు. అయినా మేము ఎక్కడా ప్రచారం చేసుకోలేదు. బీజేపీ వాళ్ల దృష్టిలో నువ్వుగానీ, చంద్రబాబు కానీ పెద్ద పుడింగిలు కాదు అన్నది చెప్పకనే చెప్పారు. మీ ఇద్దరి కన్నా జూనియర్ ఎన్టీఆర్ బెటర్ అనే అమిత్ షాగారు అతడిని కలవడం జరిగింది.
రంగా హత్యతో బాబుకు సంబంధం లేదని చెప్పించగలవా..?
ఆంధ్రరాష్ట్రంలో కాపుల గురించి పదే పదే మాట్లాడే పవన్ కల్యాణ్… కాపులకు ఆరాధ్య దైవం అయిన వంగవీటి రంగా హత్య విషయంలో చంద్రబాబుకు సంబంధం లేదని రాష్ట్రంలో ఏ ఒక్కరితో అయినా చెప్పించగలవా?. కాపు గర్జన సమయంలో తుని రైలు దగ్ధం ఘటనకు సంబంధించి చంద్రబాబు దుర్మార్గంగా పెట్టిన కేసులను జగన్‌గారు అధికారంలోకి వచ్చాక ఎత్తివేయడం జరిగింది. కేంద్రంలోని బీజేపీతో కలిసి ఉన్నానని చెప్పుకునే పవన్ కల్యాణ్.. ఏనాడైనా కాపుల తరపున వకల్తా పుచ్చుకుని ఆ కేసులు ఎత్తివేయించే ప్రయత్నం చేశాడా?.
నాకు కులం లేదు, మతం లేదనే పవన్.. మరోవైపు కాపులంతా తనకే ఓటు వేయాలని మాట్లాడటం సిగ్గుచేటు. కాపు గర్జన సందర్భంగా తుని ఘటనలో కాపు యువతను వేధించిన తీరు, కాపు అక్కచెల్లెమ్మలను పెట్టిన హింస, వారిని కొట్టిన తీరు మా కళ్లతో మేం చూశాం. ఆ కేసుల్లో మమ్మల్ని కూడా అన్యాయంగా ఇరికించారు. కాపు ఉద్యమంతో పాటు వంగవీటి రంగా హత్యకేసులో చంద్రబాబు నాయుడుకు రాష్ట్రంలో ఏ ఒక్కరితో అయినా క్లీన్‌చిట్ ఇప్పించగలవా?.
వీటికి సమాధానం చెప్పి.. ఆ తర్వాత నువ్వు చంద్రబాబుకు ఊడిగం చేస్తానన్నా కాపులు ఎవరూ పట్టించుకోరు. కాపులకు ఇంత అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడుకు భజన చేస్తూ, ఆయన్ను భుజానకెత్తుకుని మోస్తానంటే.. నీ వెనుక నడవడానికి కాపులు ఎవరూ సిద్ధంగా లేరని స్పష్టం చేస్తున్నాం.