Suryaa.co.in

Andhra Pradesh

మహిళల మాన ప్రాణాలతో చెలగాటం ఆడతారా?

-నోటీసులు ఇస్తే డ్రామాలు ఆడతారా?
-ప్రజలు అసహ్యించుకునేలా విజయ్‌ పోస్టులు
-మహిళల శీలాన్ని అవమానించేలా పోస్టింగ్‌లు
-టీడీపీ అధికార వెబ్‌సైట్‌ ఐటీడీపీ ద్వారా పోస్టులు
-అందుకే విచారణ కోసం పోలీసులు పిల్చారు
-అది ఏమైనా తప్పు చేయడమా?
-వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున

దుష్ట చతుష్టయం నానా యాగీ:
సోషల్‌ మీడియాలో దారుణంగా పోస్టులు పెట్టి, మహిళలను అవమానించిన అరాచకవాది చింతకాయల విజయ్‌. అలాంటి దుర్గార్గమైన వ్యక్తి ఇంటికి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వెళ్తే, అది ఘోరమని టీడీపీ.. దాని అనుబంధ దుష్ట చతుష్టయం నానా యాగీ చేస్తోంది.
చింతకాయల విజయ్‌ అనేవాడు అలాంటి పోస్ట్‌లు పెట్టడం కరెక్టేనా?. దానికి శిక్ష ఉండదా?. పోలీసులు విచారణ చేయకూడదా?. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. విజయ్‌ ఇంటికి పోలీసులు వెళ్లారంటూ.. దాన్ని తీవ్రంగా తప్పు పడుతూ.. అదేదో దొంగలు వెళ్లినట్లు దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు.

ఇంతకీ ఏది తప్పు:
దొంగను పట్టుకోవడానికి పోలీసులు వెళ్తే తప్పు పట్టే స్థాయికి వచ్చింది వీరి వ్యవహారం. ఇంటికి వెళ్లి సీఐడీ పోలీసులు నోటీసులు ఇవ్వడం తప్పా? లేక మహిళల మాన, ప్రాణం మీద, వారి శీలం మీద పోస్టులు పెట్టడం, పెట్టించడం తప్పా?.
దొంగ తనను దొంగగారు అని పిల్చి, సీఐ సీట్లో కూర్చోబెట్టి.. కాఫీ, టీ.. అందించాలని కోరుకుంటున్నాడంటే.. దాన్ని ఇంకొంత మంది వెనకేసుకు వస్తున్నారంటే.. ఇంత కంటే ఘోరం ఉంటుందా?.

దుర్మార్గం. అయినా చెప్పరు!:
ఇంతకీ వీరు ఏం చేశారంటే.. మహిళల మాన, ప్రాణాల మీద.. వారి శీలం మీద అసభ్యంగా పోస్టులు పెట్టారు. అది కూడా టీడీపీ అధికారిక వెబ్‌ పేజీ నుంచి. ఐటీడీపీ సైట్‌ నుంచి మహిళల మీద దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు. అయినా ఈ విషయం మాత్రం టీడీపీ కానీ, దుష్ట చతుష్టకం కానీ చెప్పవు. దోచుకో..పంచుకో..తినుకో బ్యాచ్‌కు తెలిసింది.. అధికారంలో ఉంటే సమాజం మీద, రాష్ట్రం మీద పడి తినడం మాత్రమే.

మీలా మేము చేయలేదు:
చంద్రబాబు భార్య మీద, కోడలి మీద.. రామోజీరావు భార్య మీద, కోడలి మీద, రామోజీరావు మనవరాళ్ల మీద.. రాధాకృష్ణ కూతురు మీద.. ఇలా వారి ఇళ్లలో ఉన్న మహిళల మీద ఏనాడూ మేము ఇటువంటి విమర్శలకు దిగడం లేదు. మా పార్టీ ప్రజలకు చేసిన మంచిని, మేలును నమ్ముకున్న పార్టీనే తప్ప.. దిగజారుడు ప్రచారాన్ని.. దిగజారుడు రాజకీయాన్ని మేము నమ్ముకోలేదు.
ఇంత నిగ్రహంగా మా నాయకత్వం, మేము ఉన్నా.. ఎక్కడో ఎవరో ఒకరు సహనం కోల్పోయి ప్రతిస్పందనగా పోస్టింగ్‌ పెడితే.. దేనికి ప్రతిస్పందనగా రియాక్ట్‌ అయ్యారో చెప్పకుండా.. నానా యాగీ చేస్తున్నారు.

మాకు విచక్షణ ఉంది:
ఎన్నో మంచి పనులు చేసి, గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చిన ముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు. చింతకాయల విజయ్‌కు నోటీసు ఇస్తే, ఆయన తండ్రి అయ్యన్నపాత్రుడు ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. మేమూ తిట్టగలం. కానీ మాకు విచక్షణ ఉంది. సంస్కారం ఉంది.
కాబట్టి ఇకనైనా అయ్యన్నపాత్రుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి. విజయ్‌ శిక్షార్హుడు.

మాకు అ అవసరం లేదు:
బట్ట కాల్చి మీద వేయడం టీడీపీకి అలవాటు. బురద చల్లడం వారి పద్ధతి. టీడీపీ నేతలకు నిజంగా సిగ్గు ఉంటే, చింతకాయల విజయ్‌ను సమర్థించవద్దు. విజయ్‌ తప్పు చేయకపోతే, ఆయన పెట్టిన పోస్టులపై చర్చ పెట్టండి.
మా ప్రభుత్వానికి కక్ష సా«ధింపు అవసరం లేదు. మాది సంక్షేమ ప్రభుత్వం. ఎవరినో వేధించడం కోసం కేసులు పెట్టాల్సిన అవసరం లేదు.. అంటూ ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి నాగార్జున వివరించారు.

LEAVE A RESPONSE