Suryaa.co.in

Telangana

భూమి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ

– రవీంద్ర భారతి లో నిర్వహించిన ఐలమ్మ 127 వ జయంతి వేడుకలలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన యోధురాలు ఐలమ్మ జయంతి ని ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. వెనుకబడిన వర్గాలు సంఘటితం కావాలి… అభివృద్ధి సాధించాలి. వెనుకబడిన వర్గాల అభివృద్ధి ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి. బడుగుల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఆత్మగౌరవ భవనాలు నిర్మించింది ప్రభుత్వం. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించే ఉద్దేశం తో 310 గురుకుల పాఠశాలను ప్రారంభించింది.వెనుకబడిన వర్గాల ఉన్నతికి ఎంతో కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు రుణపడి ఉండాలి.

LEAVE A RESPONSE