Suryaa.co.in

Andhra Pradesh

పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని మంత్రి అంబటి రాంబాబు

-చంద్రబాబు సహకారంతో వేదాద్రి ఎత్తిపోతల పథకం తెచ్చా
-9 నెలల్లో పట్టిసీమ పూర్తి చేసి రైతులకు నీరు అందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే.
– చేతగాని, అసమర్ధ వైసీపీ ప్రభుత్వం మొలకెత్తిన రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు
– మాజీ మంత్రి దేవినేని ఉమ

రెడ్డిగూడెం మండలం,కూనపురాజపర్వ:: రైతుల కష్టం ఏంటో నాకు తెలుసని దళారులు రైతుల కష్టాన్ని దోచుకుంటుంటే తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేని అసమర్ధ దద్దమ్మ ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కూనపురాజపర్వ దాన్యం కల్లాలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దళారులు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. రూ 1632/- రూపాయల ఇవ్వాల్సిన దాన్యం బస్తాకు 800/- లకు కొట్టేస్తున్నారు. పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని, రాయలసీమకు ఇవ్వాల్సిన నీటిని వాళ్లకు ఇచ్చేశాడు ఎన్నికల రోజు సాగర్ డ్యాం మీద పోలీసులను మోహరించి డ్రామాలకు తరలిపోయాడు.

పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని మంత్రి అంబటి రాంబాబు. 9 నెలల్లో పట్టిసీమ పూర్తి చేసి రైతులకు నీరు అందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే. 42 మంది ఎమ్మెల్యేలు జెండా ఎత్తేయటానికి సిద్ధంగా ఉన్న విషయం తెలుసుకొని డైవర్షన్ పాలిటిక్స్ కోసం నేను లండన్ వెళ్తున్న బాబును అరెస్టు చేయండి అంటూ జగన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశాడు. రైతు, కౌలు రైతు కన్నీరు పెడుతుంటే పట్టించుకొనే తీరిక ముఖ్యమంత్రి కి లేదు పంటల బీమా డబ్బులు కూడా చెల్లించలేదు.

రైతు కష్టం ఏంటో నాకు తెలుసు 1994లో మా అన్న రమణ కృష్ణమ్మ ను 300 అడుగులకు ఎత్తిపోయాలని సంకల్పించాడు. ఆయన మాట ప్రకారం చంద్రబాబు సహకారంతో వేదాద్రి ఎత్తిపోతల పథకం తెచ్చా.3,132 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన నారా లోకేష్ రాష్ట్రంలో సమస్యలను తెలుసుకొని ఎవరికి ఏం చేస్తాడో హామీ ఇచ్చాడు

LEAVE A RESPONSE