Suryaa.co.in

Telangana

8 ఏళ్ల కింద ఒక సీఎం ఇక్కడ ఎస్సారెస్పీ కాలువకు శంకుస్థాపన చేస్తే ఒక్క రోజు నీళ్ళు వచ్చాయి

-సీఎం కేసీఆర్ కాలేశ్వరం కట్టి వద్దు అనేటట్టు నీరు ఇస్తున్న మహానుభావులు
-సీఎం కేసీఆర్ దయ వల్లే మహబూబాబాద్ జిల్లా వచ్చింది..బాగు పడ్డది
-మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

(మహబూబాబాద్, జనవరి 12) ముఖ్యమంత్రి కేసీఆర్ దయ వల్లే మహబూబాబాద్ జిల్లా ఏర్పడ్డది..బాగు పడింది అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 8 ఏళ్ల కింద ఒక ముఖ్యమంత్రి ఇక్కడకు వచ్చి ఎస్.ఆర్.ఎస్.పి కి శంకు స్థాపన చేస్తే ఒక్కరోజు నీరు వచ్చిందని, ఆ తరవాత ఎప్పుడూ రాలేదన్నారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం కట్టి ఇప్పుడు వద్దు అనేటట్టు నీరు ఇస్తున్న మహానుభావులు అని పొగిడారు. మహబూబాబాద్ జిల్లా నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయాల సముదాయం ప్రారంభం అనంతరం ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించే సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ దయ వల్ల మహబూబాబాద్ జిల్లా అయింది.40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను.మా తాతలు, తండ్రులు మహబూబాబాద్ జిల్లాలో ఉండే. మా భూములు ఇక్కడే ఉంటాయి.మేము వ్యవసాయం చేసినప్పుడు చెర్లల్లో, బావుల్లో, బోర్లల్లో కూడా నీళ్ళు లేవు.తాగేందుకు తండాల్లో నీరు లేదు.మోటార్లు, స్టార్టర్లు కాలి పోయేవి. ఈరోజు మహబూబాబాద్ జిల్లా ఎలా ఉంది? కేసిఆర్daya దయ వల్ల ప్రతి చెరువు ఎండా కాలంలో మత్తడి పోస్తుంది. 24 గంటల కరెంట్ ఉంది. నేను మొదట ఎమ్మెల్యే అయినప్పుడు తండాలు, గ్రామాలలో కుండలు, బిందెలతో ఎదురు వచ్చేవాళ్ళు.ఇప్పుడు ఎక్కడా కుండలు, బిందెలు అగుపడుత లేవు. మిషన్ భగీరథ ద్వారా కృష్ణ, గోదావరి నీళ్ళు ఫిల్టర్ చేసి ఇచ్చిన మహానుభావుడు కేసిఆర్ .తండాలు గ్రామ పంచాయతీలు చేశారు. అవి బాగు పడ్డాయి.మహబూబాబాదజిల్లా సీఎం కి రుణపడి ఉంది. ఇంటింటికి నీరు ఇస్తా అని, 24 గంటల కరెంట్ ఇస్తా అని హామీ ఇవ్వలేదు. ఎన్నికల్లో చెప్పలేదు. అయినా చేశారు.

గత 8 ఏళ్ళ కింద ఒక ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడే ఎస్.ఆర్.ఎస్.పి నీళ్లకు శంకు స్థాపన చేశారు. ఆ ఒక్క రోజే నీళ్ళు వచ్చాయి. అది వాస్తవం. ఆ తర్వాత నీళ్ళ చుక్క రాలేదు.ఈరోజు వద్దనేటట్టు నీళ్ళు ఇస్తున్న మహానుభావుడు సీఎం కేసీఆర్ . ఆయన దయవల్ల కాళేశ్వరం కట్టి, 24 గంటల నీరు వస్తుంది. మహబూబాబాద్ వాసులు ఏదైనా సమస్య వస్తే, రోగం వస్తే వరంగల్ వెళ్ళేది. కలెక్టరు ఆఫీస్ చుట్టూ తిరిగేది. ఈరోజున అందమైన కలెక్టరు కార్యాలయం వచ్చింది. 510 కోట్ల రూపాయలతో పెద్ద హాస్పిటల్ కట్టి మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఇచ్చిన మహానుభావులు.ఇవన్నీ అడగకుండానే ఇచ్చారు.

మహబూబాబాద్, మరిపెడ, డోర్నకల్, తొర్రూరులను మున్సిపాలిటీలు చేశారు.మీ హయంలోనే అందంగా తీర్చి దిద్దారు అని గొప్పగా చెప్పుకుంటున్నాం.నేను మొదట ఎమ్మెల్యే అయినప్పుడు
తొర్రూరు చూస్తే ఎంత గలీజుగా ఉందని, చెత్త చెదారం, వాసన అనేవారు. ఈరోజు తొర్రూరు నుంచి వెళ్ళేవారు ఎంత అందంగా తయారు చేశారని నన్ను పొగుడుతున్నారు. మా ఆరాధ్య దైవం మీరు. నిన్ను నమ్ముకున్న మేము అడగకుండానే ఇస్తారనే నమ్మకం ఉంది.నాలుగు మున్సిపాలిటీలకు నిధులు ఇస్తారు అనే నమ్మకం ఉంది. నియోజక వర్గానికి కూడా ఇస్తారనే నమ్మకం ఉంది.మాకు చాలు. తృప్తి ఉంది.మీ ఆశీర్వాదంతో మహబూబాబాద్ జిల్లా బాగుంది.మీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం అదృష్టంగా భావిస్తాం.

LEAVE A RESPONSE