Suryaa.co.in

Telangana

బలగం సినిమా నటులను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో రూపొందించబడి విజయవంతంగా నడుస్తున్న బలగం సినిమా నటులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. బలగం సినిమాలో కొమురయ్య తమ్ముడు అంజయ్య పాత్రలో నటించి బాగా పేరు తెచ్చుకున్న రాయపర్తి కి చెందిన గుడి బోయిన బాబుని మంత్రి సత్కరించారు. అలాగే ఈ సినిమాలో నటించిన కర్తానందం, వేముల ప్రభాకర్ లను కూడా మంత్రి సన్మానించారు. కాగా గుడి బోయిన బాబుది వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండల కేంద్రం. ఎన్నో చైతన్య నాటకాలలో నటించిన బాబు బలగం సినిమాలో ఉదాత్తమైన పాత్రను పోషించారు. తండ్రి చనిపోతే పాతి పెట్టడానికి ఆరడుగుల స్థలం కూడా లేని స్థితిలో పంచాయతీ పెట్టుకుంటున్న కొడుకుల పరిస్థితిని చూసి జాలిపడిన బాబాయి పాత్రలో బాబు బాగా రాణించారు. అని మంత్రి ఎర్రబెల్లి బాబుని అభినందించారు అలాగే మిగతా పాత్రలు పాత్రధారులు అద్భుతంగా వ్యక్తి కట్టాయని అందుకే సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని సక్సెస్ఫుల్గా నడుస్తోందని మంత్రి తెలిపారు.

LEAVE A RESPONSE