Suryaa.co.in

Telangana

బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ వీసిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య కె. సీతారామ రావు సతీమణీ కుసుంబ రేవతి ఇటీవల మరణించడంతో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు యూనివర్శిటీకి వెళ్లి వీసిని పరామర్శించారు. స్వర్గియ కుసుంబ రేవతి చిత్రపటం వద్ద పూలు వేసి, నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. ఆచార్య సీతారామ్ కి ధైర్యం చెప్పారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, టిఎస్ పిఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఉన్నారు.

LEAVE A RESPONSE