Suryaa.co.in

Andhra Pradesh

పేదల ఇళ్ల స్థలాల ముసుగులో, ముఖ్యమంత్రి అండతో రూ.1000 కోట్లు కాజేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్

• జగనన్నఇళ్ల మాటున జగన్ రెడ్డి, మంత్రి అమర్నాథ్ కలిసి అనకాపల్లి నియోజకవర్గంలో 1300 ఎకరాలకు పైగా రైతులు భూములు బలవంతంగా లాక్కున్నారు
• భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయకుండా, మంత్రి అమర్నాథ్ తన అనుచరుల్ని రైతులుగా చూపి వారికి ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టడానికి సిద్ధమయ్యాడు
• పేదలకు ఇళ్లస్థలాల పేరుతో ముఖ్యమంత్రి, మంత్రి కలిసి దాదాపు అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా రూ.1000కోట్ల వరకు కాజేశారు
• మంత్రికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అనకాపల్లి నియోజకవర్గంలో జరిగిన భూ కుంభకోణంపై సిట్ లేదా సీఐడీ దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రిని కోరాలి
– మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ

జగనన్న కాలనీల నిర్మాణం ముసుగులో, పేదలకు సెంటు పట్టాలు ఇస్తున్నామని చెబుతూ, అనకాపల్లి జిల్లాలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి గుడివాడ అమర్నాథ్ రూ.1000కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడని, ఈ కుంభకోణం వెనకున్న ప్రధాన సూత్రధారి ముఖ్యమంత్రి అయితే…దాన్ని నడిపించింది మంత్రి అమర్నాథ్ అని టీడీపీ నేత, మాజీ శాసన సభ్యులు పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడిన మాట్లాడిన వివరాలు..ఆయన మాటల్లోనే ..
“ పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలనే నెపంతో, రైతుల్ని భయపెట్టి, వారి భూముల్ని బలవంతంగా లాక్కున్నారు. ఆనాడు భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయకుండా మంత్రి గుడివాడ అమర్నాథ్ రైతుల పేరుతో తనపార్టీ వారికి ప్రభుత్వ సొమ్ము దోచిపెడుతున్నాడు. భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయడానికి తాను మూడు నెలల నుంచీ స్థానిక అధికారులు చుట్టూ తిరుగుతున్నాను. స్థానిక కలెక్టర్ కు మొరపెట్టుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. అమర్నాథ్ సాగించిన భూ కుంభకోణంపై నేడు తాను సీఎంవోలో..డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాను. సీఐడీ దర్యాప్తు జరిపించాలని కూడా సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది.

పవన్ కల్యాణ్..చంద్రబాబుని తిట్టడం మానేసి, తక్షణమే మంత్రి అమర్నాథ్ తనపై వచ్చిన భూకుంభకోణం ఆరోపణలపై దర్యాప్తు జరిపించమని ముఖ్యమంత్రిని కోరాలి
ఈ కుంభకోణం గుట్టుమట్లు తెలుసుకోవడానికి సమాచారహక్కు చట్టం కింద ప్రభుత్వా న్ని వివరాలు అడిగితే, కలెక్టర్ తనవద్ద ఉన్న సమాచారం వెల్లడించకుండా, నాకు మరో రకమైన సమాచారం ఇచ్చారు. మొత్తం సమాచారాన్నే ట్యాంపరింగ్ చేశారు. అనకాపల్లి నియోజకవర్గంలో దాదాపు 1300ఎకరాలకు పైగా భూమిని ఇళ్లపట్టాల పేరుతో సేకరింపచేసిన గుడివాడ అమర్నాథ్ కోట్లరూపాయల ప్రజలసొమ్ముని కాజేశారు.

ఈ భూ కుంభకోణానికి సంబంధించిన వాస్తవాలు బయటకు రావాలంటే ప్రభుత్వం తక్షణమే సిట్ లేదా సీఐడీ ద్వారా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తు న్నాం. అమర్నాథ్ కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ముఖ్యమంత్రితో మాట్లాడి భూ కుంభ కోణంపై దర్యాప్తు జరిపించాలి. పవన్ కల్యాణ్, చంద్రబాబుల్ని తిట్టడం మానేసి అమర్నాథ్ తక్షణమే తన సచ్ఛీలతను నిరూపించుకోవాలి. జగనన్నఇళ్ల పేరుతో అనకాపల్లి నియోజకవర్గంతో పాటు.. జిల్లా వ్యాప్తంగా సేకరించిన భూముల్లో రూ.1000 కోట్ల అవినీతి జరిగింది. ఎక్కడి కక్కడ వైసీపీనేతలు..మంత్రులు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్టు పైకిచెప్పి, లోలోపల వందలకోట్లు కాజేశారు.

అనకాపల్లి జిల్లాలోని మిల్లర్స్ అసోసియేషన్.. స్టోన్ క్రషర్స్ యాజమాన్యాల నుంచి కూడా మంత్రి అమర్నాథ్ ప్రత్యేక సెస్సు వసూలు చేస్తున్నాడు. మైనింగ్ ద్వారా వచ్చే రాయల్టీ సొమ్ము మొత్తం అమర్నాథ్ కే చేరుతోంది. స్థానికంగా ఉన్న రంగవోలు రిజ ర్వాయర్ ల్యాండ్ ను కూడా గుడివాడ కాజేశాడు. దానిపై పలుమార్లు అధికారులకు, కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం కూడా పచ్చి బూటకంగా మారింది.” అని పీలా చెప్పారు.

LEAVE A RESPONSE