ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై గవర్నర్ తమిళిసై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అటవీ, పర్యావరణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ రాజకీయ విమర్శలు చేయడం తగదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలతో గవర్నర్ ఏకీభవించాలని లేదని.. అయితే ప్రశ్నించే అధికారం మాత్రం ఆమెకు లేదని స్పష్టం చేశారు. సీయం కేసీఆర్ గొప్ప రాజనీతిజ్ఞుడని, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని ఎలా గౌరవించాలో ఆయనకు తెలుసని అన్నారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి గవర్నర్ పదే పదే రాజకీయాలు మాట్లాడుతూ… ఓ పార్టీకి లబ్ధి చేకూరే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాజకీయాలలో జోక్యం చేసుకోడం మానేకోవాలని సూచించారు.