Suryaa.co.in

Telangana

రంజాన్ తోఫా ఆగయా

-ముస్లిం సోదరులకు మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక కానుక
-స్వయంగా రంగంలోకి మంత్రి జగదీష్ రెడ్డి
-నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికి తిరుగుతూ
-సొంత ఖర్చులతో ఆనవాయితీ కొనసాగింపు
-పవిత్ర మాసంలో కొనసాగుతున్న ప్రత్యేక ఇఫ్తార్ విందులు
-సమైక్యతను చాటి చెబుతూ
-ఇదీ మంత్రి జగదీష్ రెడ్డి మార్క్

రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ప్రతి యేటా అందిస్తున్న తరహాలోనే ఈ సంవత్సరం ముస్లిం సోదరులకు మంత్రి జగదీష్ రెడ్డి తోఫా పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఉదయం ప్రారంభించారు. సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలోని జమ్మిగడ్డ, గోపాలపురం,విజయకాలనీ,తాల్లాగడ్డ తదితర ప్రాంతాల్లో ఇల్లిల్లూ తిరుగుతూ ముస్లిం సోదరులకు తోఫా కిట్లను ఆయన అందజేశారు. ఇదే విదంగా సూర్యాపేట పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ముస్లిం కుటుంబానికి అందే విదంగా, మంత్రి జగదీష్ రెడ్డి రూట్ మ్యాప్ రూపొందించారు. అందుకనుగుణంగా మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ప్రణాళికా బద్దంగా తోఫా కిట్ ను ముస్లిం కుటుంబాలకు చేరవేస్తున్నారు.

మండు టెండలను ఖాతరు చేయకుండా మంత్రి జగదీష్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ పంపిణీ చేయడాన్ని ముస్లిం సోదరులు స్వాగతిస్తున్నారు.తోఫా పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి వెంట రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,సీనియర్ బి ఆర్ యస్ నేతలు వై.వి, గండూరీ ప్రకాష్,రాజేష్, ముస్లిం మైనారిటీ నాయకులు తాహెర్, బాషా,రియాజ్,సయ్యద్, సల్మామస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక సూర్యపేట నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి మంత్రిగా కొనసాగుతున్న మంత్రి జగదీష్ రెడ్డి, ముందెన్నడూ లేని రీతిలో రూపొందించిన తోఫా కిట్ల పై తనదైన మార్క్ వేశారు. సుమారు కోటి రూపాయల తో ప్రత్యేకంగా తయారు చేసిన తోఫా కిట్ల పంపిణీని మంత్రి జగదీష్ రెడ్డి దగ్గర ఉండి మరి ఏర్పాట్లు చేశారు.

కనీవినీ ఎరుగని పద్దతిలో మంత్రి జగదీష్ రెడ్డి సొంత ఖర్చులతో రూపొందించిన తోఫా కిట్ల ముస్లిం కుటుంబాలను ఎంతగానో ఆకర్షించాయి.ఒక వైపు సర్వమత సామ రస్యాన్ని కాపాడుతూనే ముస్లిం లు అత్యంత పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసంలో మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశారు.దానితో పాటు హిందు, ముస్లిం, క్రిస్టియన్ ల ఐక్యత ను చాటి చెప్పే విదంగా, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బతుకమ్మ,రంజాన్ ,క్రిస్మస్ పర్వదినాలను నిర్వహిస్తున్న విషయం విదితమే.

ఈ క్రమంలోనే రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్ విందులు,ముస్లిం సోదరులకు దుస్తుల పంపిణి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.దానికి తోడు మంత్రి జగదీష్ రెడ్డి తనదైన శైలిలో సూర్యపేట నియోజకవర్గ వ్యాప్తంగా పది రకాల పండుగ సామగ్రితో కూడిన ప్రత్యేక తోఫా కిట్ లు అందించడంతో పాటు, మసీదు లలో మంత్రి జగదీష్ రెడ్ది సొంత ఖర్చులతో ఇస్తున్న ప్రత్యేక ఇఫ్తార్ విందులు రంజాన్ మాసంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

LEAVE A RESPONSE