Suryaa.co.in

Andhra Pradesh

మంజునాథ్ ను అడ్డం పెట్టుకొని మంత్రే భూములు కాజేశాడు

– ప్రభుత్వ భూములు కొట్టేసిన బాగోతంపై లోకేశ్ విసిరిన సవాల్ కు మంత్రి జయరామ్ స్పందించాలి
-మంజునాథ్ అనే వ్యక్తి నుంచి కొన్నభూములు ఎలాంటివో జయరామ్ కు తెలియదా?
-మైనింగ్, బియ్యం మాఫియా, ల్యాండ్ కబ్జాలుతప్ప జయరామ్ కు ప్రజల సమస్యలు పట్టడంలేదు
-అంతా సక్రమంగా ఉంటే జయరామ్ కు ఐటీ నోటీసు లు ఎందుకు వచ్చాయి?
-ఆదోనిలో ఒకచిన్నరోడ్డు వేస్తే సమస్యలు తీరినట్టేనా?
-ప్రభుత్వం నుంచి మా కుటుం బానికి ఒక్కరూపాయి వచ్చినట్టు జయరామ్ నిరూపించగలడా?”
-యువగళం పాదయాత్ర ప్రదేశంలో (ఆదోని) ఆలూరు టీడీపీ ఇన్ ఛార్జ్ కోట్ల సుజాతమ్మ

“మంత్రి గుమ్మనూరు జయరామ్ మతిలేకుండా మాట్లాడుతున్నాడు. జయరామ్ కళ్లుమూ సుకొని పాలు తాగుతున్న పిల్లి చందంగా వ్యవహరిస్తున్నాడు. జయరామ్ కు దమ్ము, ధైర్య ముంటే లోకేశ్ విసిరిన సవాల్ పై స్పందించాలి. ప్రభుత్వభూముల్ని మార్కెట్ ధరకే తిరిగి తీసుకొని ప్రజలకు అప్పగిస్తామన్న లోకేశ్ సవాల్ కు జయరామ్ ఏం సమాధానంచెబుతాడు ? జయరామ్ గతంలో తెలుగుదేశంపార్టీలో ఎంపీటీసీగా పోటీచేసి ఓడిపోయినకూడా, పార్టీ ఆయనకు జడ్పీటీసీ టిక్కెట్ ఇచ్చింది.

తనకు రాజకీయజీవితం ఇచ్చిన టీడీపీనికాదని జయరామ్ ప్రజారాజ్యంలోకి వెళ్లాడు. ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు. ప్రజాధనాన్ని దోచుకోవ డానికే జయరామ్ పార్టీలు మారాడు. తాగటానికి నీళ్లు లేవని ప్రజలు లోకేశ్ తో మొరపెట్టు కుంటే, దానికి కూడా వక్రభాష్యాలు చెబుతున్నారు. మంజునాథ్ అనే వ్యక్తి నుంచి కొన్నభూములు ఎలాంటివో జయరామ్ కు తెలియదా?

మంజునాథ్ ను అడ్డంపెట్టుకొని ప్రభుత్వ భూములుకాజేసింది జయరామే. భూముల వ్యవహారం కోర్టులో ఉంటే, జయరామ్ ఏధైర్యంతో వాటిని కాజేశాడు? అసభ్యకరంగా మాట్లాడితే తానేదో పెద్దనాయకుడు అవుతా నని జయరామ్ అనుకుంటున్నాడు. మాకు తిట్టడంరాదా..తిట్టలేమా? సంస్కారం ఉంది కాబట్టే ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం. ప్రభుత్వ భూములు ఏ పెత్తందారులచేతుల్లో ఉన్నాయో జయరామ్ చెప్పాలి. ఇసుక అమ్మకాలు, మైనింగ్, బియ్యం మాఫియా, ల్యాండ్ కబ్జాలుతప్ప జయరామ్ కు ప్రజల సమస్యలు పట్టడంలేదు.

వాణిజ్యభూమిని వ్యవసాయభూమిగా రికార్డులు మార్చి, దాన్ని ఎకరం రూ.లక్షా10వేలకు కొన్నట్లు మంత్రి జయరామ్ చెప్పాడు. అంతా సక్రమంగా ఉంటే జయరామ్ కు ఐటీ నోటీసు లు ఎందుకు వచ్చాయి. ఇసుక, మైనింగ్, ల్యాండ్ కబ్జాలు తప్ప జయరామ్ కు కనీసం ప్రజ లకు తాగునీరు ఇవ్వాలనే ఆలోచన కూడాలేదు. విలేకరి తనగురించి రాశాడని అతనిపై కక్ష కట్టిన వ్యక్తి జయరామ్. జయరామ్ పుట్టింది ఎక్కడ..ఎక్కడికి వచ్చి మంత్రి అయ్యాడు. పల్లె టూళ్లలో ఇళ్లముందు బైక్ లు పెడితే, దానికికూడా జయరామ్ పోలీసులతో జరిమానాలు వే యించి, ఆ డబ్బంతా తానే కొట్టేస్తున్నాడు. మంచిపనులు చేసేవాళ్లను ఆశీర్వదించి, జయరా మ్ వంటి వారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిస్తున్నాను. భూములు ఏ పెత్తందారుల చేతుల్లో ఉన్నాయో జయరామ్ చెప్పాలి. ప్రభుత్వంలో ఉన్నవ్యక్తి ప్రభుత్వభూ ములు కాపాడలేడా?

కర్నూలు జిల్లాలో ఈ ప్రభుత్వం ఒక్కరోడ్డు కూడా వేయలేదు. గత ప్రభుత్వం వేసిన రోడ్లపై తిరుగుతూ, సిగ్గులేకుండా అంతా తామేచేశామని చెప్పుకుంటున్నా రు. ఆదోనిలో ఒకచిన్నరోడ్డు వేస్తే సమస్యలు తీరినట్టేనా? గ్రామాల్లోని వీధుల్లో తిరగలేక ప్రజ లు పడుతున్న అవస్థలు జయరామ్ కు కనిపించడంలేదా? ప్రభుత్వం నుంచి మా కుటుం బానికి ఒక్కరూపాయి వచ్చినట్టు జయరామ్ నిరూపించగలడా?”

LEAVE A RESPONSE