Suryaa.co.in

Andhra Pradesh

ఢిల్లీ వెళ్ళి బోషడీకే అంటే.. అక్కడ చెప్పు తీసుకు కొడతారు బాబూ..!

– ఢిల్లీ వెళ్ళి బాగున్నారా అనడానికి బోషడీకే అని బాబు పిలుస్తారా..?
– పాద నమస్కారాలు.. నోట్ల కట్టల దండలు వేయించుకున్నది చందాబాబానా లేక చంద్రబాబానా..?
– సీబీఐని రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని బీరాలు పలికి.. ఇప్పుడు అదే కావాలంటారా..?
– ప్రభుత్వం మీద ఉగ్రవాదుల్లా దాడి చేస్తున్నది టీడీపీనే
– పేరుకి టీడీపీ జాతీయ పార్టీ, బద్వేల్, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయదు
– వైయస్ఆర్సీపీ కార్యకర్త మీద ఈగ వాలినా ఒప్పుకోని నాయకుడు జగన్
– చిటికె వేయండి.. సీఎం ఇంటిపై దాడి చేస్తామని అనడం ఉగ్రవాదం కాదా..?
– పవన్ కల్యాణ్ తల్లి గురించి టీడీపీ హయాంలో కామెంట్ చేస్తే.. జగన్ స్పందించారు.
– ఆగ్రోస్ ను మూసి వేస్తున్నారన్న వార్తల్లో నిజం లేదు. ఇంకా బలోపేతం చేస్తున్నాం
– వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రెస్ మీట్ 
మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
1- రాష్ట్రంలో దుర్మార్గ‌మైన ప‌రిస్థితులు ఉన్నాయ‌ని ఢిల్లీ వెళుతున్నామ‌ని చెబుతున్న చంద్ర‌బాబు నాయుడు … రాష్ట్ర‌ప‌తిగారిని, ప్రధానమంత్రి గారిని, అమిత్ షా గారిని క‌లిసిన త‌ర్వాత బాగున్నారా అని పలకరించడానికి మీరు ఏమ‌ని సంభోదిస్తారు. వారిని బోషడీకే అని పిలుస్తారా..? మ‌రి, ఇంట్లో మీ కొడుకు, మీ పార్టీ నేత‌లు బోష‌డికే అనే మిమ్మల్ని కూడా పిలుస్తారా?
– ఢిల్లీ వెళ్లి ఏం చెబుతారు? బోష‌డికే అంటే.. అక్క‌డ అది చాలా తీవ్ర‌మైన ప‌దం. చంద్ర‌బాబు దీక్ష సందర్భంగా నిన్న చేసిన ప్రసంగం వింటుంటే నవ్వొస్తుంది. టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనను సీబీఐతో విచార‌ణ చేయించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. మీ ప్ర‌భుత్వ హాయాంలో.. రాష్ట్రంలో సీబీఐ అడుగుపెట్ట‌డానికి వీల్లేదని చెప్పింది ఎవరు?. అదే నోటితో ఇప్పుడేమో సీబీఐతో విచార‌ణ జ‌రిపించాలని డిమాండా?
2- చంద్రబాబు దీక్ష సందర్భంగా.. సినిమాల్లో బ్ర‌హ్మానందం కామెడీ సీన్ల‌లో వ‌చ్చిన‌ట్లు నారా లోకేష్ ఎంట్రీ ఇచ్చాడు. లోకేష్ మాటలు చూస్తే… చంద్ర‌బాబులాంటి ప‌రిస్థితి ఏ తండ్రికీ రాకూడ‌దు అనిపించింది. నిన్న లోకేష్ మాట్లాడుతూ.. దుగ్గిరాల‌లో ఎంపీటీసీలు గెలిచామని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో మంగళ‌గిరిలో గెలిచి వాళ్ల నాన్న‌కు గిఫ్ట్‌గా ఇస్తామ‌ని చెబుతున్నాడు. ఎవ‌రైనా స‌రే టీడీపీని గెలిపించి, రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చేలా చేస్తామ‌ని చెప్ప‌డాన్ని గిప్ట్ అంటారా? ఎంపీటీసీల‌ను గెలిపించాం.. అదే నీకు గిప్ట్ అని ఏ కొడుకు అయినా అంటాడా?
– లోకేష్ ఏమో ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో గెలిచామ‌ని అంటున్నాడు. మ‌రి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లను బ‌హిష్క‌రించామ‌ని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమంటారు? మ‌రి దుగ్గిరాలలో బీ-ఫామ్ ఎవ‌రు ఇచ్చారు? మీకు తెలియ‌కుండా మీ అబ్బాయి బీఫామ్ ఇచ్చేశాడా?. ఓడిపోతేనేమో ఎన్నిక‌లు బ‌హిష్క‌రించిన‌ట్లు అట‌. గెలిస్తేనేమో నాన్నకు గిఫ్ట్ అట.. నారా లోకేష్ పొంత‌న లేని మాట‌ల‌ను వింటూ అదే వేదిక మీద ఉన్న చంద్ర‌బాబు ఎంత‌గా కుమిలిపోయి ఉంటారో? ఇలాంటి కొడుకుని ఎలా క‌న్నానా అని బాధ‌ప‌డుతూ ఉంటారు. ఎవ‌రైనా ఒక ఎంపీ సీటు గెలిచి గిప్ట్ ఇస్తామంటారేమో కానీ ఎంపీటీసీ గెలిచి బ‌హుమ‌తి ఇస్తామ‌ని చెబుతారా..?
– జనరల్ ఎన్నిక‌లు జ‌రిగేందుకు చాలా స‌మ‌యం ఉంది కాబ‌ట్టి… రేపు రాబోతున్న కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలలో టీడీపీ గెలిచి చూపిస్తే బాగుంటుంది. మీ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో కుప్పంలో గెల‌వండి ముందు.
3- దీక్ష పేరుతో టీడీపీ నేత‌లు 36 గంటల బూతుల పంచాంగం విప్పారు. దుర్మార్గ‌మైన భాష మాట్లాడుతూ రెచ్చ‌గొట్టే ధోరణితో వ్య‌వ‌హ‌రించారు. నిన్న అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ప్ర‌తి గ్రామంలో టీడీపీ కార్య‌క‌ర్త‌లు పుస్త‌కం పెట్టుకుని, దానిలో వైయ‌స్సార్ సీపీ నాయ‌కుల పేర్లు రాసుకోవాల‌ట‌. వాళ్లు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆరు నెల‌ల పాటు వీరి సంగ‌తి చూస్తార‌ట‌. అధికారంలోకి వ‌స్తామ‌ని టీడీపీవాళ్లు క‌లలు కంటున్నారు, ఒక‌వేళ అధికారంలోకి వ‌స్తే ఆరేడునెల‌ల పాటు వైయ‌స్సార్ సీపీ కార్య‌క‌ర్త‌ల‌ను హింసించ‌డ‌మో, అణ‌చివేయ‌డ‌మో, అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డ‌మో, చంపేద్దామ‌నుకుంటున్నారో ఏమో మ‌రి. ఎంతసేపటికీ టీడీపీ వాళ్ళు వైయ‌స్సార్ సీపీని అంత‌మొందించడానికో, క‌క్ష సాధింపు చ‌ర్య‌లకో అధికారంలోకి రావాల‌నుకుంటున్నారే త‌ప్ప‌, రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజనాల కోసం మాత్రం కాదు అన్నది వారి మాటల్లోనే అర్థమైంది.
– మీ హయాంలో ఇలాంటి ద‌రిద్ర‌పు ప‌నులు చేశారు కాబ‌ట్టే.. 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు మిమ్మ‌ల్ని త‌రిమిత‌రిమి కొట్టారు. 23 సీట్ల‌కు ప‌రిమితం చేశారు. కేవ‌లం మూడు ఎంపీటీసీలు గెలుచుకునేలా మీ పార్టీని అధఃపాతాళానికి ప‌డ‌గొట్టారు. అయినా మీకు సిగ్గు రాలేదు. రాష్ట్రంలో వైయ‌స్సార్ సీపీ కార్య‌క‌ర్త‌ల మీద చేయి వేస్తే చూస్తు ఊరుకోవ‌డానికి.. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిగారు సిద్ధంగా లేరు. కార్య‌క‌ర్తల మీద ఈగ వాలితే కూడా ఒప్పుకోని నాయ‌కుడు జగన్ మోహన్ రెడ్డిగారు. మా కార్య‌క‌ర్త‌లు ఎంత గ‌ట్టిగా ప‌నిచేస్తారో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది క‌దా. అధికారంలో లేకపోయినా.. ప‌దేళ్ల పాటు వైఎస్ జ‌గ‌న్ గారితో పాటు న‌డిచారు.
4- టీడీపీ కార్యాల‌యం దేవాల‌యం అంటున్నారు? దాడి చేస్తారా అని ప్ర‌శ్నిస్తున్నారే? మ‌రి మీరు, ఏకంగా మీ దేవుడు ఎన్టీఆర్‌ మీదే రాళ్లు, చెప్పులతో దాడి చేశారు క‌దా? మ‌రి దేవాల‌యంలో ఎవరైనా మంత్రాలు చదువుతారా.. బూతులు చ‌దువుతారా అని ప్ర‌శ్నిస్తున్నాం. బూతులు మాట్లాడిన వ్య‌క్తిని స‌మ‌ర్థించ‌డం చూస్తే.. చంద్ర‌బాబు నాయుడు వైఖ‌రి, మనస్తత్వం ఏవిధంగా ఉందే అర్థం అవుతుంది.
– నిజానికి నిన్న దీక్ష సందర్భంగా.. త‌మ పార్టీ నేత బూతు మాట‌లను ఖండిస్తూ క్ష‌మాప‌ణ చెబుతార‌ని చంద్ర‌బాబు నుంచి ఆశిస్తే… చివ‌ర‌కు 36 గంట‌ల దీక్ష త‌ర్వాత కూడా అబ్బెబ్బే ఇదేమీ త‌ప్పు కాదంటూ మాట్లాడ‌తారా? మ‌రోవైపు వాళ్ల పార్టీ నాయ‌కులేమో బోష‌డికే అంటే బాగున్నారా? అని చెబుతున్నారు క‌దా, అందుకే ఢిల్లీ వెళ్లి చంద్ర‌బాబు తాను క‌ల‌వాల‌నుకున్న నాయ‌కులంద‌రినీ బాగున్నారా? అని కాకుండా బోష‌డికే ప‌దాన్ని వాడిచూస్తే ఏవిధంగా స‌మాధానం వ‌స్తుందో తెలుస్తుంది. సిగ్గులేని మాట‌లు బుద్ధి హీన‌త‌తో మాట్లాడ‌టం అంటే ఇదే.
5- ఇక్కడ చేసిన రచ్చ సరిపోక.. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గారిపై బుద‌ర చ‌ల్లేందుకే చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌నకు వెళుతున్నారట. అక్క‌డ‌కు వెళ్లి ఏం చెబుతారు, ముఖ్యమంత్రిని పట్టుకుని బూతులు మాట్లాడించి, రెచ్చగొట్టానని చెబుతారా?
– ప‌్ర‌భుత్వం మీద ఉగ్ర‌వాదుల్లా దాడి చేస్తుంది తెలుగుదేశం పార్టీనే.
– పేద‌ల జీవితాల‌ను బాగు చేసేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తే అడుగ‌డుగునా అడ్డుప‌డ‌తారు. ఇళ్ల స్థ‌లాల పంపిణీ మీద, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల మీద‌, అమ్మ ఒడి ప‌థ‌కాల మీద‌ కోర్టుల‌కు వెళ్లి స్టేలు తెచ్చి అడ్డుకుంటారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను అడ్డుకుని రాష్ట్రంలోని పేద‌, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల బ‌తుకులు బాగుచేసే కార్య‌క్ర‌మం మీద ఉగ్ర‌వాద దాడి చేస్తున్న‌ది మీరు కాదా?
– ఎందుకీ సంక్షేమ ప‌థ‌కాలు అని మాట్లాడ‌తారు? ఎక్క‌డ నుంచి డ‌బ్బులు తీసుకువ‌స్తున్నార‌ని అడుగుతారు. ఏనాడు అయినా పేద‌ల‌కు ప‌ది రూపాయలు సాయం చేసిన బ‌తుకేనా మీది?
– మీ ప్ర‌భుత్వ హయాంలో కార్పొరేటు సంస్థ‌ల‌తో అంట‌కాగింది మీరు కాదా? చివ‌ర‌కు ఎంత‌గా దిగ‌జారిపోయారంటే ప‌ట్టాభి లాంటి వ్య‌క్తితో సాక్షాత్తూ ముఖ్య‌మంత్రిగారి మీద బుర‌ద చ‌ల్లించే కుట్ర‌లు చేసి, పార్టీ బ‌తికే ఉంద‌నిపించుకోవడానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.
6- చంద్ర‌బాబు చిటికె వేస్తే వైఎస్ జ‌గ‌న్ గారు తాడేప‌ల్లిలో ఎలా కూర్చుంటారో మేము చూస్తామ‌ని టీడీపీ నేత‌లు మాట్లాడుతున్నారు. ముఖ్య‌మంత్రి నివాసంపై దాడి చేస్తామ‌ని మీ స‌మ‌క్షంలోనే అంటుంటే నివారించ‌లేని మీదా నాయ‌క‌త్వం? దాన్ని ఉగ్ర‌వాదం అంటారా? మ‌రేమంటారు? దాడి చేసి చూడండి ఏం జ‌రుగుతుందో చూద్దాం. అధికారంలో లేన‌ప్పుడే వైఎస్ జ‌గ‌న్ గారు ల‌క్ష‌లాదిమంది కార్య‌క‌ర్త‌ల‌తో రోడ్డు మీద న‌డిచారు. మీరొచ్చి బెదిరిస్తారా? చివ‌రికి త‌ల్లుల‌ను కూడా కించ‌ప‌రుస్తారా?
– పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌గారి త‌ల్లి మీద ఎవ‌రో అనుచిత వ్యాఖ్య‌లు చేస్తే ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ గారు స్పందిస్తూ అమ్మ ఎవ‌రికైనా అమ్మే… వాళ్ల‌ను కించ‌ప‌ర‌చవ‌ద్ద‌ని అన్నారు. మ‌హిళ‌ల‌ను గౌర‌వించి, స‌ముచిత స్థానం ఇచ్చారు కాబ‌ట్టే ఏ ప‌థ‌కం అయినా ఈ ప్రభుత్వంలో మ‌హిళ‌ల పేరు మీదే ఇస్తున్నారు. ఇళ్ల ప‌ట్టాలు మొద‌లుకొని ఏ ప‌థ‌కంలో అయినా మ‌హిళ‌ల‌కు అగ్ర‌తాంబులం ఇచ్చిన గొప్ప నాయకుడు, సంస్కారవంతుడు జ‌గ‌న్ గారు. ఆయ‌న‌కు మీకు పోలికేంటి? చివ‌ర‌కు త‌ల్లుల‌ను కూడా దూషించేస్థాయికి రాజ‌కీయాలను దిగ‌జార్చి దొంగ, కొంగ‌ జ‌పాలు చేస్తే ప్ర‌జ‌లు న‌మ్మేస్థితిలో లేరు.
– ముస‌లి కొంగ ఒడ్డున కూర్చుని జపం చేస్తూ చేప‌లు ప‌ట్టుకున్నట్టు…చంద్ర‌బాబు కూడా నాలుగు ఓట్ల కోసం దొంగ దీక్ష‌లు చేస్తున్నారు. గ‌తంలో మీరు చేసిన దీక్ష‌ల‌ను ప్ర‌జ‌లు ఎందుకు న‌మ్మ‌లేదు. మీరు ఎన్ని ముసుగులు వేసుకు వ‌చ్చినా ప్ర‌జలు మిమ్మ‌ల్ని ఎప్ప‌టికీ న‌మ్మ‌రు. నాయ‌క‌త్వం అంటే నాలుగు పెద్ద బూతు పదాలు మాట్లాడితేనో, భ‌య‌ప‌డితేనో, వార్నింగ్‌లు ఇస్తేనో రాదు… ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను గెలుచుకుంటే వ‌స్తుంది.
7- మీరు అధికారంలోకి వ‌స్తే.. రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్క‌డ దాక్కున్నా లాక్కొచ్చి తంతారా? కేసులు పెడ‌తారా? లోకేష్.. ఏం మాట్లాడుతున్నావో నీకు అయినా అర్థం అవుతుందా? ఎందుకంత పెద్ద పెద్ద మాట‌లు. నీ వ‌ల్ల‌, మీ నాన్న వ‌ల్ల‌కూడా కాదు. మీకులా పారిపోయి హైద‌రాబాదులో దాక్కున్న‌ట్లు కాదు. ఓటుకు కోట్లు కేసులో రాష్ట్ర ప్ర‌జ‌లు ప్ర‌యోజ‌నాలు తాక‌ట్టుపెట్టి, రాత్రికి రాత్రి పారిపోయి వ‌చ్చి బెజ‌వాడ క‌ర‌క‌ట్ట మీద త‌ల‌దాచుకున్న మీరు చెబుతారా క‌థ‌లు? దాక్కోవ‌డం గురించి మీరు మాట్లాడ‌తారా? ద‌య‌చేసి రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయ‌వ‌ద్దు. రాజ‌కీయాలు హుందాగా ఉండాలి. మా నాయ‌కుడు త‌ప్పుగా మిమ్మ‌ల్ని ఎప్పుడైనా మాట్లాడారా? చ‌ంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో ఏం జ‌రుగుతుందా అని మేము ఎదురు చూస్తున్నాం. మీ అంత దిగ‌జారుడు రాజ‌కీయాలు మేం చేయ‌లేం.
8- రాష్ట్రంలో ప్ర‌తి కుటుంబం బాగుండాల‌ని, గ‌త రెండున్న‌రేళ్లుగా ముఖ్య‌మంత్రిగారు తప‌స్సు చేసిన‌ట్లు కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. సంక్షేమ‌ కార్య‌క్ర‌మాలు చేస్తుంటే వాటిని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు ప్ర‌తిప‌క్షం కుట్ర‌లు చేస్తూనే ఉంది. రూ.6,400 కోట్ల‌ను ఆస‌రా ప‌థ‌కం కింద మ‌హిళ‌ల ఖాతాల్లో వేస్తుంటే దాన్ని డైవ‌ర్ట్ చేయ‌డం కోసం, ప్ర‌జ‌లు మ‌ర్చిపోయేలా బూతు పురాణం మొద‌లు పెట్టారు. గ‌త కొంత‌కాలంగా గ‌మ‌నిస్తే పేద ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కోసం, వారి ఖాతాల్లో ముఖ్య‌మంత్రిగారు డ‌బ్బులు వేస్తున్నప్పుడల్లా.. అదేరోజు అటూఇటుగా చంద్ర‌బాబు ఆ అంశాన్ని మ‌రుగున ప‌డేలా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. ఇది ఎత్తుగ‌డ అని చంద్ర‌బాబు అనుకుంటే అది ఎత్తిపోయే గ‌డ అని మేము అనుకుంటున్నాం. టీడీపీ జ‌నంలో నుంచి బిషాణా ఎత్తిపోయారు. బూతులు తిట్ట‌డం, సీఎంను కించ‌ప‌ర‌చ‌డం మీ ఎత్తుగ‌డా?
9- మీ రాజకీయాలు, మీ బూతు మాటలకు.. మీ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులే ఎందుకిలా దిగ‌జారిపోతున్నామ‌ని, మ‌ధ‌న‌ప‌డుతున్నారని మాకు సమాచారం అందుతుంది. మేము మీ ట్రాప్‌లో ప‌డ‌ద‌ల‌చుకోలేదు. మీ ట్రాప్‌లో ప‌డతామ‌నుకుంటే అదంతా మీ భ్ర‌మ‌.
– దీక్ష స‌మంయ‌లో నోట్ల క‌ట్ట‌లు, పాద న‌మ‌స్కారాలు చేస్తుంటే …చంద్ర‌బాబా? లేక చ‌ందా బాబా అనే అనుమానం ఎవరికైనా క‌లుగుతోంది. మిమ్మ‌ల్ని ఏమ‌ని పిల‌వాలి?
– రాష్ట్ర ప్ర‌యెజ‌నాలు, ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసే విధంగా టీడీపీ య‌త్నిస్తోంది. డ్ర‌గ్స్‌, గంజాయి, హెరాయిన్ అని మాట్లాడుతున్నారు. ఇది మాత్రం క్ష‌మించేవిష‌యం కాదు. తెలుగువారికి ఒక ఆత్మ గౌర‌వం ఉంటుంది. ముఖ్య‌మంత్రిగారి మీద కోపంతో ప్ర‌భుత్వంపై బుర‌ద‌చ‌ల్లే కార్య‌క్ర‌మం చేస్తున్నారు. దాన్ని క‌డ‌గ‌డ‌మే నిత్యం మా ప‌ని అయిపోయింది. గంజాయి సాగు మీద ఉక్కుపాదం మోపుతున్న‌ది మా ప్ర‌భుత్వం. ఇంకా చ‌రిత్ర లోతుల్లోకి వెళితే గంజాయి మూలాలు మీ పార్టీలోనే ఉన్నాయ‌ని తెలుస్తోంది. అది ముందుగా తెలుసుకుంటే మంచిది. దుర్మార్గ‌పు ప్ర‌చారం చేస్తున్నారు టీడీపీ నేత‌లు. సిగ్గుందా లేదా? స్పృహ ఉండే మాట్లాడుతున్నారా? మాఫియా ప‌నులు చేసేది మీరు?
– గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం గంజాయి సాగును కంట్రోల్ చేస్తోంద‌ని జాతీయ మీడియా సైతం రాస్తోంది. వాటిని చూడండి. అయినా ప‌క్క‌దారి ప‌ట్టించి మాట్లాడుతున్నారు. మీరు తిట్టేసి పోతే ఎవరూ మాట్లాడ‌కుండా కూర్చోవాలి, ప‌్ర‌తిస్పందించ‌కూడ‌దు అన్నది మీ సిద్ధాంతమా…? మీరు మాత్రం మా దేవాల‌యం మీద దాడి అనొచ్చు. మీరు మాత్రం మీ దేవుడిని చంపేయ‌వ‌చ్చు. త‌ప్పు జ‌రిగింది క్ష‌మించండి అనాల్సింది పోయి… అదేదో త‌ప్పు కాద‌ని మాట్లాడ‌టం చూస్తుంటే మిమ్మ‌ల్ని బాగుచేయ‌డం ఎవ‌రి త‌రం కాదు.
– టీడీపీ పేరుకి జాతీయ పార్టీయేగానీ, బద్వేల్, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మాత్రం పోటీ చేయదు.
10- లోకేష్ గురించి ఏం మాట్లాడినా త‌క్కువే. ఆయ‌న ట్రైల‌ర్ చూపిస్తున్నాం అని అంటున్నాడు. 2019లో మీ తండ్రీకొడులు ఏకంగా సినిమానే చూశారు క‌దా?, అలానే ఇటీవల వచ్చిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో సినిమా చూశారుగా? ఇంకేమీ చూపిస్తారు? వ‌ర‌స పెట్టి వైఎస్ జ‌గ‌న్‌గారు ఎన్నికల్లో విజ‌య‌పరంప‌ర చేస్తుంటే.. దుగ్గిరాల‌లో ఎంపీటీసీ గెలిచామని లోకేష్ చెబుతున్నాడు. వైయ‌స్సార్ గారి కుమారుడు జ‌గ‌న్ గారు రాజ‌కీయంగా కుమ్మేస్తుంటే… పాపం చంద్ర‌బాబుగారి కొడుకు మాత్రం మరోలా కుమ్మేస్తున్నాడు. చంద్ర‌బాబుకు ఇలాంటి స్థితి వ‌స్తుంద‌ని ఎన్న‌డూ ఊహించి ఉండ‌లేదు. ముఖ్య‌మంత్రిగారిపై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తే వైయ‌స్సార్ సీపీ కార్య‌క‌ర్త‌లు స‌హించ‌రు. జ‌నం కూడా మిమ్మ‌ల్ని ఛీకొడుతున్నారు దాన్ని గుర్తు పెట్టుకోండి. ఆగ్రోస్‌ను మూసేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి… అది వాస్త‌వం కాదు. ఆగ్రోస్‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తున్నాం.

LEAVE A RESPONSE