Suryaa.co.in

Andhra Pradesh

శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఇన్ఛార్జి మంత్రి కొడాలి నాని

– మబగాంలోని స్వగృహంలో ధర్మాన ఆతిథ్యం
– ఘనస్వాగతం పలికిన మంత్రి సీదిరి అప్పలరాజు
– మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు
శ్రీకాకుళం, అక్టోబర్ 26: శ్రీకాకుళం జిల్లాలో ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారులు వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా మబగాంలోని డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ స్వగృహానికి మంత్రి కొడాలి నాని చేరుకున్నారు. ధర్మానతో పాటు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తదితరులు మంత్రి కొడాలి నానికి ఘనస్వాగతం పలికారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్ కుమార్, కంబాల జోగులు, కళావతి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, డీసీసీబీ చైర్మన్ కే రాజేశ్వరరావు, జడ్పీటీసీ సభ్యుడు చైతన్య తదితరులు మంత్రి కొడాలి నానిని మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలను మంత్రి కొడాలి నానికి ధర్మాన పరిచయం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులపై నేతలంతా చర్చించుకున్నారు. అనంతరం తన స్వగృహంలో మంత్రి కొడాలి నానితో పాటు నాయకులందరికీ ధర్మాన ఆతిథ్యం ఇచ్చారు. అక్కడి నుండి నాయకులందరితో కలిసి మంత్రి కొడాలి నాని డీఆర్సీ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్ళారు.

LEAVE A RESPONSE