Suryaa.co.in

కుటుంబ సమేతంగా భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న మంత్రి కొడాలి నాని
Andhra Pradesh

కుటుంబ సమేతంగా భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న మంత్రి కొడాలి నాని

– ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం
– అంతరాలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు
– అనుబంధ ఆలయంలో శ్రీలక్ష్మీతాయారమ్మ దర్శనం
– రూ.13 లక్షల విలువైన స్వర్ణ కిరీటం బహుకరణ
– శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలోనూ పూజలు
– వేద మంత్రోచ్ఛారణలతో వండితుల వేదాశీర్వచనం
భద్రాచలం, డిసెంబర్ 6: తెలంగాణా రాష్ట్రం భద్రాచలంలోని భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయ
6-PHOTO-5
కార్యనిర్వహణాధికారి శివాజి, ఏఈవో శ్రావణ్ కుమార్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆలయ ఉప ప్రధాన అర్చకులు విజయ రాఘవన్ లు ఆలయ మర్యాదలతో మంత్రి కొడాలి నాని- అనుపమ దంపతులు, తల్లి కొడాలి వింధ్యారాణి, సోదరుడు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) – శ్రీవిద్య దంపతులు, కుమార్తె అఖిలాండేశ్వరీ దేవి, కుమారుడు అర్జున్ బాబు, యుఎస్ఏలో ఉంటున్న అక్క, బావ కోనేరు లీలాప్రసాద్ – చాముండేశ్వరీ దేవి, కుమార్తె స్నేహ తదితరులకు సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని కుటుంబ సమేతంగా ఆలయ ప్రదక్షిణలు చేశారు. అంతరాలయంలో వైభవంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు.ఈ సందర్భంగా రూ.13 లక్షల విలువైన స్వర్ణ కిరీటాన్ని
6-PHOTO-3ఆలయ కార్యనిర్వహణాధికారి శివాజి చేతులమీదుగా అందజేశారు. అనుబంధ ఆలయంలో శ్రీలక్ష్మీతాయారమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల నడుమ పండితులు వేదాశీర్వచనం చేశారు. శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేయడం జరిగింది.
6-PHOTO-6అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు కొలువై ఉన్న భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తుంటారన్నారు. పవిత్రమైన గోదావరి నది భద్రగిరిని చుట్టుకుని దక్షిణ దిశ వైపుగా ప్రవహిస్తోందన్నారు. శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని, శ్రీలక్ష్మీతాయారమ్మ, ఆంజనేయ స్వామివారిని కూడా దర్శించుకోవడం జరిగిందన్నారు. శ్రీసీతారామచంద్ర స్వామి ఆశీస్సులతో రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో విలసిల్లాలని ప్రార్థించానని చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అహర్నిశలూ శ్రమిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అవసరమైన శక్తియుక్తులను శ్రీసీతారామచంద్ర స్వామి ప్రసాదించాలని వేడుకున్నట్టు మంత్రి కొడాలి నాని తెలిపారు.

LEAVE A RESPONSE