Suryaa.co.in

Telangana

సీఐ కుర్చీలో మంత్రి కొండా

-సోషల్‌మీడియాలో హల్‌చల్
– ముదురుతున్న కొండా-రేవూరి ఫ్లైక్సీ వార్

ధర్మారం: కొండా వర్సెస్ రేవూరి వర్గీయుల మధ్య ఫ్లెక్సీల వివాదం గీసుగొండ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీనితో కొండా వర్గీయులను గీసుగొండ పోలీసులు అరెస్ట్ చేయడంతో, కొండా

వర్గీయులు ధర్మారం వద్ద ధర్నా చేశారు. ఇది తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ అక్కడికి చేరుకొని గీసుగొండ పోలీస్ స్టేషన్ కు చేరుకొని సీఐ కుర్చీలో కూర్చుని, పోలీసులతో మాట్లాడే వీడియో వివాదాస్పదంగా మారింది.

పోలీస్ స్టేషన్ లో ఉన్న కొండా సురేఖకు హై కమాండ్ నుండి ఫోన్ రావడంతో వెంటనే పోలీస్ స్టేషన్ నుండి మీడియాతో నేను ఏమీ మాట్లాడను అంటూ వెళ్ళి పోయారు. గతంలో కొండా వర్సెస్ రేవూరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సంచలనంగా మారిన పరిస్థితి. ఇప్పుడు ఫ్లెక్సీల వివాదం మళ్లీ వారిద్దరి మధ్య మరింత దూరాన్ని పెంచింది. ఈ వివాదాలు ఎక్కడకు దారితీస్తాయో వేచి చూడాలి.

LEAVE A RESPONSE