అమరావతి: పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇవాళ తన శాఖ అధికారులపై మండిపడ్డారు. మండలి సమావేశాల లిస్టింగ్స్ లో తన ప్రశ్న ఉన్నప్పటికీ, అధికారులు సమాధానాన్ని సిద్ధం చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలి నుంచి బయటికొచ్చి ఏంచేస్తున్నారు? ఎందుకు సమాధానం ఇవ్వలేకపోయారో లిఖితపూర్వకంగా ఇవ్వండని సదరు అధికారులను ఆదేశించారు.