నేతన్నల బతుకులు మారడానికి మేము చేయూత నిచ్చాం..కానీ కేంద్ర సర్కార్ చిన్న భరోసా కూడా ఇస్తలేదు. ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలు మాతో కలిసి కొట్లాడితే మంచిది.చేనేత ,జౌళి శాఖ డెవలప్మెంట్ విషయంలో కేంద్ర సర్కార్ నిర్లక్ష్య ధోరణి మానుకోవాలి. నేతన్నల బతుకులు మారడానికి తెలంగాణ సర్కార్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది.
చేనేత అభివృద్ధికి తోడ్పడలని ఏడున్నర ఏండ్లుగా ఎన్నో సార్లు విన్నవించినా కేంద్ర ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలే.మెగా పవర్ లుమ్ క్లస్టర్ మంజూరు చేయమంటే ఇప్పటికి ఉలుకు లేదు పలుకు లేదు. మరమగ్గాలను ఆధునీకరించడం కోసం సహాయం చేయమంటే పట్టించుకున్న పాపాన పోలేదు.
జాతీయ చేనేత డెవలప్మెంట్ పథకం కింద 26 బ్లాకులు మంజూరు చేయమంటే 6 చేసి చేతులు దులుపుకొన్నారు.దాన్యం కొనుగోళ్ల విషయంలో మా ఎంపీలు లోక్ సభలో కొట్లాడిర్రు..ఇక నుండి ఉద్యమమే.