ఒకే వేదికపైకి నందమూరి-నారా-దగ్గుబాటి కుటుంబాలు

ఒకే వేదికపైకి నందమూరి-నారా-దగ్గుబాటి కుటుంబాలు

– చాలాకాలం తర్వాత తోడల్లుళ్లు.. అక్కా చెల్లెలు!
– చంద్రబాబు-దగ్గుబాటి పలకరింపు
– నందమూరి కూతురి ఫంక్షన్‌లో నారా-దగ్గుబాటి మాటామంతీ
( మార్తి సుబ్రహ్మణ్యం)
babu-daggubati2వాళ్లిద్దరూ ఒకప్పుడు ఒకే లక్ష్యంతో కలసి పనిచేసినవారు. ఆ తర్వాత నుంచి ఉప్పు-నిప్పూ! ఒకరంటే మరొకరికి పొసగదు. పేరుకు తోడల్లుళ్లు అయినప్పటికీ, ఏ కార్యక్రమాల్లోనూ వారిద్దరూ కలిసిన దాఖలాలు లేవు. అందులో ఒకాయన ఇంకా తమ మామ గారికి జరిగిన వెన్నుపోటు గురించి చెబుతుంటారు. పుస్తకాలు రాస్తుంటారు. అయినా ఇంకొకాయన వాటిని పెద్దగా పట్టించుకోరు. తన తోడల్లుడి గురించి ఎక్కడా మాట్లాడరు. అటు అక్కచెల్లెలు కూడా ఎవరి దారి వారిదే. అయితే నారా-దగ్గుబాటి మధ్య మాటల్లేకపోయినా వారి వారసుల మధ్య బంధాలు మాత్రం బలంగానే ఉన్నాయి. అది వేరే విషయం.
babu-daggubati3అలాంటి తోడల్లుళ్లను నందమూరి ఇంట జరిగిన ఓ పెళ్లి కార్యక్రమం కలిపింది. మాటా మంతీకి వేదికయింది. పలకరింపులు,కష్టసుఖాల ముచ్చట్లకు కారణమయింది. ఇంతకూ ఆ తోడల్లుళ్లు ఎవరంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి కూతురు వివాహవేడుకకు, చంద్రబాబు-వెంకటేశ్వరరావు ఒకే సమయంలో హాజరుకావడం అందరినీ ఆకట్టుకుంది. ఈ ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌లో బాబు-దగ్గుబాటి చాలాసేపు ఏకాంతంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు చొరవ తీసుకుని అన్న దగ్గుబాటి భుజంపై ఆప్యాయంగా చేయి వేసి తీసుకువెళ్లారు.
అటు అక్కచెల్లెల్లయిన పురందీశ్వరి-భువనేశ్వరి కూడా ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. హైదరాబాద్‌కు వచ్చిన బాబు, ఈ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమంలో చాలాసేపు గడిపారు. తర్వాత నందమూరి-నారా-దగ్గుబాటిbabu-daggubati కుటుంబసభ్యులంతా దిగిన గ్రూప్ ఫొటో, ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల అసెంబ్లీలో భువనేశ్వరిపై, వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలను పురందేశ్వరి ఖండించగా, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా భువనేశ్వరికి క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే.