Suryaa.co.in

Telangana

నేతన్న భీమా కార్యక్రమం పైన మంత్రి కేటీఆర్ సమీక్ష

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశంలో ఎక్కడ లేని విధంగా నేతన్నల కోసం చేపట్టనున్న నేతన్న భీమా కార్యక్రమాన్ని మంత్రి కే. తారక రామారావు సమీక్షించారు. టెక్స్టైల్ శాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాష్ తో పాటు టెక్స్టైల్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. నేతన్న బీమా కార్యక్రమం ప్రారంభోత్సవానికి చేస్తున్న ఏర్పాట్లను ఈ సందర్భంగా కేటీఆర్ సమీక్షించారు. ఇప్పటికే బీమా కార్యక్రమానికి సంబంధించి క్షేత్రస్థాయిలో నేతన్నలకు సమాచారం తమ శాఖ తరఫున అందిస్తున్నామని, రాష్ట్రంలో ఉన్న సుమారు 80,000 మంది నేతన్నలకు ఈ బీమా లబ్ధి చేకూర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను టెక్స్టైల్ శాఖ అధికారులు మంత్రి కేటీఆర్ కు వివరించారు. నూతన బీమా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవలసిన చర్యలపైన మంత్రి కేటీఆర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

LEAVE A RESPONSE