Suryaa.co.in

Telangana

మంత్రి కేటీఆర్ సేవలు జాతీయ స్థాయికి ఎదగాలి

-పాలనలో తండ్రికి తగిన తనయుడిగా ముద్ర
-పుట్టిన రోజున ప్రజాపయోగ కార్యక్రమాలు
-ఆధునిక పరిజ్ఞానంతో హైదరాబాద్ అభివృద్ధి
– మంత్రి జగదీష్ రెడ్డి
-మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు
– ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధుల సమక్షంలో మొక్కలు నాటి కేక్ కట్ చేసిన మంత్రి జగదీష్ రెడ్డి
-గిఫ్ట్ ఏ స్మైల్ కింద పేద గిరిజన విద్యార్థినికి ల్యాప్ టాప్ బహుకరణ

బి ఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కలువకుంట్ల తారకరామారావు సేవలు జాతీయ స్థాయిలో విస్తరించాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్ర సాధనలో ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడిన తండ్రి ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగిన తనయుడిగా పేరొందరన్నారు.రాష్ట్ర ఐటి మరియు పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,నల్లగొండ, భోనగిరి యాదాద్రి జడ్ పి చైర్మన్లు బండా నరేందర్ రెడ్డి,ఎలిమినేటి సందీప్ రెడ్డి లు,నల్లగొండ జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షుడు శాసనసభ్యులు యన్.రవీంద్ర నాయక్ లతో పాటు గాధరి కిశోర్ కుమార్,కంచర్ల భూపాల్ రెడ్డి,యన్.భాస్కర్ రావు,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,ఫైళ్ల శేఖర్ రెడ్డి,రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్ కుమార్,మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస రెడ్డి,మాజి ఉన్నత విద్యామండలి చైర్మన్ ఒంటెద్దు నరసింహా రెడ్డి,నంద్యాల దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు మంత్రుల నివాస ప్రాంగణంలో మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్ది మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలు ప్రజాపయోగ కరంగా జరగాలని కోరుకున్న మనసున్న నేత కేటీఆర్ అని ఆయన ప్రశంశించారు.

అందులో భాగంగా ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని సూర్యపేట నియోజకవర్గ పరిధిలోని మోగ్గయ్యగూడెం కు చెందిం పేద గిరిజన బి టెక్ విద్యార్థిని కి గిఫ్ట్ ఏ స్మైల్ కింద అత్యంత ఆధునిక ల్యాప్ ట్యాప్ ను బహుకరించారు.తన అనుభవాన్ని రంగరించి ఆధునిక పరిజ్ఞానంతో హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన మంత్రి కేటీఆర్ మరింత ఉన్నతికి ఎదగాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

LEAVE A RESPONSE