Suryaa.co.in

Andhra Pradesh

వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్జ్ బ్రెండెని కలిసిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

– డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ -19 నియంత్రణ చర్యలకు బోర్జ్ బ్రెండె ప్రశంసలు
న్యూఢిల్లీ,నవంబర్,12; వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్జ్ బ్రెండెని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కలిశారు. ఆర్థికవృద్ధి, కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను బోర్జ్ బ్రెండెకి మంత్రి గౌతమ్ రెడ్డి వివరించారు. న్యూఢిల్లీలో శుక్రవారం సాయంత్రం కలిసిన మంత్రి మేకపాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ -19 నియంత్రణ చర్యలను, ఎదుర్కొన్న విధానాలను డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ కి వివరించారు.2022లో జనవరి 17-21 మధ్య దావోస్ లో నిర్వహించే డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం పలికినట్లు ఈ సందర్భంగా డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ వెల్లడించారు. ఈ సారి “వర్కింగ్ టుగెదర్, రీస్టోరింగ్ ట్రస్ట్” నేపథ్యంగా డబ్ల్యూఈఎఫ్ జరగనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఏపీ పారిశ్రామిక విధానం, ఆర్థికాభివృద్ధి, అభివృద్ధి వికేంద్రీకరణ, కరోనా నియంత్రణలో దేశంలోనే ఏపీ ముందంజ, ఎక్కువ శాతం రికవరీ, 85శాతం వాక్సినేషన్ పూర్తి వంటి రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను మంత్రి మేకపాటి ద్వారా తెలుసుకుని బోర్జ్ బ్రెండె అభినందించారు.ముఖ్యంగా కరోనా విపత్తు సమయంలో పరిశ్రమలకు అండగా నిలబడుతూ.. పరిశ్రమలు,వర్క్ ఫోర్స్ రక్షణకై ప్రభుత్వం అనుసరించిన మార్గాలను మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి పాల్గొన్న పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఐఐసీ ఎండి సుబ్రహ్మణ్యం జవ్వాది, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్ తదితరులు హాజరయ్యారు.

LEAVE A RESPONSE