Suryaa.co.in

Andhra Pradesh

ఇళ్లలో లేని వారి ఓట్లు తొలగించాలని మంత్రి మేరుగ చెప్పారు

– వైకాపా సాంఘిక సంక్షేమశాఖా మంత్రి మేరుగ నాగార్జునపై కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసిన తెదేపా నేత నక్కా ఆనంద్‌బాబు

• 23.08.2023 న మంత్రి మేరుగ నాగార్జున ఎం.పి.డీ.ఓ ఆపీసులో నిబంధనలకు విరుద్దంగా పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు.
• సమావేశంలో వైకాపా కార్యకర్తలకు దిశానిర్ధేశం చేస్తూ 4 వేల ఫామ్-7 అప్లికేషన్లు పెట్టి ప్రత్యర్ధుల ఓట్లు తొలగించాలని చెప్పారు.
• ఇంటింటి ఓట్ల సర్వే సమయంలో ఇళ్లలో లేని వారి ఓట్లు తొలగించాలని సైతం చెప్పారు.
• వైకాపా కార్యకర్తలను రెచ్చగొట్టి ప్రత్యర్ధుల ఓట్లు తొలగించాలని చూడటం దుర్మార్గం.
• ఇది ఎన్నికల సంఘం ఆదేశాలకు, నియమనింబంధనలకు పూర్తి విరుద్దం
• ఓటర్ అర్హతలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలు చాలా స్ఫష్టంగా ఉన్నాయి.
• ప్రభుత్వ కార్యాలయాన్ని పార్టీ సమావేశానికి వాడుకొని ఓట్లు తొలగించాలని కార్యకర్తలను రెచ్చగొట్టడం చట్టవిరుద్దం.
• దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

LEAVE A RESPONSE