Suryaa.co.in

Editorial

వైఎస్సార్ హెల్త్ వర్శిటీ వీసీ- రిజిస్ట్రార్ రేసులో మంత్రి-ఎంపీ బంధువులు?

– రిజిస్ట్రార్ రేసులో ఎంపీ వేమిరెడ్డి బంధువు రాధికారెడ్డి
– వీసీ రేసులో మంత్రి సురేష్ సమీప బంధువు కూడా
– వీసీగా మళ్లీ కొనసాగేందుకు శ్యాంప్రసాద్ యత్నాలు?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇటీవలే ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ నుంచి వైఎస్సార్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా యూనిర్శిటీ కొత్త, వైస్ చాన్సలర్- రిజిస్ట్రార్ పదవుల కోసం అధికార పార్టీలోని కీలక వ్యక్తుల బంధువుల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. సీఎం వైఎస్‌కు సన్నిహితులయిన ఇద్దరిలో, ఎవరి బంధువులలో వీసీ-రిజిస్ట్రార్ పదవి దక్కుతుందన్న చర్చ యూనివర్శిటీ, పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

ప్రస్తుత వైఎస్సార్ హెల్త్ వర్శిటీ చాన్సలర్ శ్యాంప్రసాద్ పదవీకాలం, వచ్చే నెల 13తో ముగియనుంది. అయితే ఆయన తిరిగి, తన పదవీకాలం పొడిగింపు కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు వర్శిటీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో, మున్సిపల్ శాఖామంత్రి సురేష్ వియ్యంకుడు బాబ్జీతో పాటు, మరికొందరు ప్రయత్నాలకు తెరలేపారు.

అటు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సమీప బంధువయిన డైరక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరక్టర్ , ప్రముఖ సైకియాటిస్ట్ రాధికారెడ్డి వీసీ తర్వాత, కీలకమైన రిజిస్ట్రార్ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పూజా సైకియాటిస్ట్ సెంటర్ ద్వారా, అందరికీ తెలిసిన రాధికారెడ్డి పేరే రిజిస్ట్రార్ పదవికి ఖరారయినట్లు చెబుతున్నారు. అయితే మరికొందరు కూడా ఆ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.

ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అంతిమంగా సీఎం జగన్, సీఎంఓ ఆమోదం లేకుండా కీలకమైన వీసీ, రిజిస్ట్రార్ పదవు

LEAVE A RESPONSE