వరంగల్ జిల్లా పర్వత గిరి కి సమీపంలో తన వ్యవసాయ క్షేత్రంలో వేసిన ఆయిల్ పామ్ పంటను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కి స్వయంగా తీసుకువెళ్లి చూపించిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ పంటను పరిశీలించిన మంత్రి నిరంజన్ రెడ్డి. ఆ పంట సాగులో పని చేస్తున్న రైతులు, కూలీలు, వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడిన మంత్రులు. ఇంకా ఆ సాగు లో తీసుకోవాల్సిన చర్యలు, సస్య రక్షణ పద్ధతుల మీద చర్చించిన మంత్రులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నది.
ప్రపంచ వ్యాప్తంగా పామ్ ఆయిల్ కు మంచి డిమాండ్ ఉందని అందుకే, ఆయిల్ పామ్ సాగును చేస్తే, రైతులు లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. రైతులు లాభాల్లో ఉండాలన్నదే సీఎం కెసిఆర్ గారి ఆలోచన, అందుకే అనేక ప్రోత్సాహకాలు ఇస్తూ, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ఆర్థికంగా ఎదగాలి. ప్రభుత్వంలో ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగా ఆయిల్ పామ్ ను సాగు చేస్తూ, అందరినీ ఉత్సాహ పరుస్తున్నారని, తాను ఆచరించి, అందరికీ చెప్పడం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గొప్పదనమని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ సాయి చంద్ తదితరులు ఉన్నారు.