-నక్కా ఆనంద్‌బాబు
1. పెద్దిరెడ్డి సొంత తమ్ముడు తంబళ్లపల్లె ఎంఎల్ఏ ద్వారకనాధ్ రెడ్డి భూకబ్జాలు, దోపిడీలు తారాస్థాయికి చేరాయి. ఇవి వెలుగులోకి రాకుండా డైవర్ట్ చేసేందుకే అంగళ్లు గ్రామం వద్ద ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై వైకాపా రౌడీ మూకలతో దాడి చేయించాడు.
అనేకమంది టిడిపి నేతల తలలు పగలగొట్టారు. రక్తం పారించారు. చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డగించడానికి వచ్చే వైకాపా గూండాలను ఎందుకు ప్రివెంటివ్ అరెస్టు చేయలేదో డిఐజీ అమ్మిరెడ్డి సమాధానం చెప్పాలి. ప్రివెంటివ్ అరెస్టులు చేసి ఉంటే అంగళ్ళలో అరాచకం నివారింపబడి ఉండేది కాదా?. సి.ఎం కాన్వాయ్ వెళ్ళే ముందు రోజు నుంచే ప్రతిపక్ష నేతల్ని, కార్యకర్తల్ని, ఉద్యోగ సంఘనేతల్ని ప్రివెంటివ్ అరెస్టులు చేస్తున్న పోలీసులు పెద్దిరెడ్డి ద్వారకనాధ్ రెడ్డి పంపిన రౌడీలను ఎందుకు ప్రివెంటివ్ అరెస్టులు చేయలేదు?
అంగళ్ళు, పుంగనూరులలో ప్రివెంటివ్ అరెస్టులు చేయకపోవడానికి కారణం మంత్రి పెద్దిరెడ్డి వత్తిడికి ఐ.పి.ఎస్ అధికారులైన అమ్మిరెడ్డి, రిశాంత్ రెడ్డి తలవంచడం కాదా? జె-ప్లస్ క్యాటగిరీ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేత కాన్వాయ్‌పై దాడి జరగకుండా నివారించలేకపోవడం మంత్రి పెద్దిరెడ్డి వత్తిడికి తలవంచడం కాదా? చంద్రబాబు కాన్వాయ్‌పై అంగళ్ళలో దాడిచేసిన వైకాపా రౌడీల్ని ఎందుకు అరెస్టు చేయలేదు? పుంగనూరులో విచ్చలవిడిగా అరెస్టులు చేస్తూ ముందుగా అంగళ్ళలో దాడి చేసిన నిందితులను ఎందుకు అరెస్టులు చేయడం లేదు?
పెద్దిరెడ్డి బరితెగింపుకు అసలు కారణాలు:
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శన సంధర్భంగా చంద్రబాబు కాన్వాయ్‌పై ఎక్కడా దాడులు జరగలేదు. మంత్రి పెద్దిరెడ్డి, ఆయన తమ్ముడు ద్వారకానాధ్ రెడ్డి నియోజకవర్గాలలోనే ఎందుకు దాడులు జరిగాయి?
1. రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా పెద్దిరెడ్డి అక్రమ ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్లు కేటాయింపజేసుకున్నారు. దీనిపై చర్చను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి చేయించారు. ఇది తక్షణ లక్ష్యం. గడిచిన నాలుగున్నరేళ్ళ కాలంలో పెద్దిరెడ్డి రూ.40 వేల కోట్లు కుంభకోణాలకు పాల్పడ్డారు. గనులు, మద్యం, ఇసుక, సాగునీటి ప్రాజెక్టులు, భూముల ఆక్రమణలు, ఎర్రచందనం అక్రమ రవాణా ద్వారా రూ.40 వేల కోట్లు కొల్లగొట్టారు. ఈ చర్చను డైవర్ట్ చేయడానికి పుంగనూరుకు చంద్రబాబు ఎలా వస్తారో చూస్తామంటూ గత కొన్ని రోజులుగా తన అనుచరులతో సవాళ్ళు చేయించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నా ప్రివెంటివ్ అరెస్టులు ఎందుకు చేయలేదు?
2. ఏదో ఒక కేసులో జగన్ రెడ్డి జైలుకు వెళ్లితే వైకాపా పార్టీని కబ్జా చేసి సి.ఎం కావాలనే ఆలోచన మంత్రి పెద్దిరెడ్డికి ఉన్నది. పులివెందుల కన్నా పుంగనూరులోనే చంద్రబాబును బాగా ఎదుర్కొన్నాననే సంకేతాన్ని రాష్ట్రంలో వైకాపా శ్రేణులకు పంపడానికే పెద్దిరెడ్డి అరాచకం చేయించాడు. కుప్పంలో పెద్దిరెడ్డి హడావిడికి కూడా ఇదే కారణం. చంద్రబాబుకు నేనే సరైన ప్రత్యామ్నాయమని, జగన్ రెడ్డి కాదనే సంకేతాన్ని పంపడం మంత్రి పెద్దిరెడ్డి అసలు వ్యూహంగా ఉన్నది. అందుకే తెలుగుదేశం కార్యకర్తలు, పోలీసుల రక్తం పారించారు.
పెద్దిరెడ్డి అరాచకాలు:
1. మద్యం రేట్లును ప్రశ్నించిన దళిత యువకుడు ఓంప్రతాప్ పుంగనూరులో శవమై తేలాడు.
2. రామచంద్రయాదవ్ ఇంటిని ధ్వంసం చేయించాడు.
3. జడ్జి రామకృష్ణపై అక్రమ కేసులు పెట్టించి అతన్ని జైలుపాలు జేశారు. అతని తమ్ముడు ఇంటిపై దాడి చేయించాడు.
4. మొలకలచెరువు జెడ్.పి.పి.టి.సీ భర్త కాండ్రెడ్డిపై అక్రమంగా నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టించారు. జిల్లా బహిష్కరణ చేసి వేధించారు.
5. పెద్దఉప్పరపల్లెలో టిడిపి సానుభూతిపరులైన రైతులకు చెందిన మామిడి చెట్లను 1500 ఎకరాల్లో పెరికించి వేశారు.
6. బల్క్‌మిల్క్ సెంటర్లను మూయించి వేసి తన స్వంత డెయిరీ శివశక్తి డైరీ ద్వారా రైతుల్ని దోపిడీ చేయిస్తున్నారు.
7. వలిగట్ల వాగు నుంచి రోజుకు 150 ట్రక్కులు బెంగుళూరుకు ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
8. పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి సంబంధించిన సిగ్మా కంపెనీకి మద్యం ట్రాన్స్‌ఫోర్టు కాంట్రాక్ట్ కొట్టేసి దోపిడీ చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఒక మద్యం డిస్టలరీ స్వాధీనం చేసుకుని దోపిడీ చేస్తున్నారు. ఇలా రూ.40 వేల కోట్లు దోపిడీ చేశారు.
9. ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఇటీవల ఎర్రచందనం స్మగ్లర్ మరియు అలిపిరి క్లైమోర్ బాంబు బ్లాస్టు కేసులో నిందితుడైన కొల్లం గంగిరెడ్డి ఇంటికి ఎందుకు వెళ్లి కలిశాడు.?
పోలీస్ అధికారులపై వైకాపా రక్తపాతం:
1. నందిగామలో చంద్రబాబు కాన్వాయ్‌పై వైకాపా రౌడీల దాడిలో చీఫ్ సెక్యురిటీ అధికారి మధు గారి రక్తం పారించారు.
2. ఎర్రగొండపాళెంలో చంద్రబాబు కాన్వాయ్‌పై వైకాపా రౌడీల ఎన్.ఎస్.జీ కమేండో అధికారి సంతోష్‌కుమార్ రక్తం కళ్లచూశారు.
3. తాడిపత్రి వైకాపా ఎం.ఎల్.ఏ పెద్దారెడ్డి వేధింపులు భరించలేక దళిత సర్కిల్ ఇన్స్పెక్టర్ సి.ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు.
4. సూళూరుపేట నియోజకవర్గంలో వైకాపా నేత సునీల్ రెడ్డి దళిత ఎస్.ఐపై దాడి చేశారు.
ఇలా రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో వైకాపా నేతలు పోలీసులపై దాడులు చేశారు. దాడులు చేసిన వైకాపా నేతలపై తగు స్థాయిలో చర్యలు తీసుకోనప్పుడు పోలీసులు ప్రతిష్ట ఏమైంది? వైకాపా అధినాయకుల వల్ల రాష్ట్ర డీ.జీ.పీ హైకోర్టు బోనులో నిలిచినప్పుడు రాష్ట్ర పోలీసుల ప్రతిష్ట ఏమైంది.?
ప్రజా తిరుగుబాటులో దేశంలో అనేక రాష్ట్రాలలో పోలీసులు గాయపడడం, పోలీసు వాహనాలు దెబ్బతింటున్నవి. దీని ద్వారా పోలీసుల ప్రతిష్ట పోదు. పైగా పెరుగుతుంది. పుంగనూరులో వైకాపా నేతలు గత మూడు రోజుల నుంచి చంద్రబాబును పుంగనూరులో తిరగనీయమని బహిరంగ సవాళ్ళు చేశారు. వారిని ప్రివెంటివ్ అరెస్టులు చేయకపోవడం వల్ల పుంగనూరు ఘటనలు చోటుచేసుకొన్నాయనేది వాస్తవం. అంగళ్ళు గ్రామంలో అగ్రసార్స్ వైకాపా నేతలే. వారు చేసిన దాడుల్లో రక్తపాతం జరిగింది. టిడిపి నేతల తలలు పగిలాయి. దోషులపై కేసులు పెట్టి అరెస్టు చేయకపోవడం పోలీసుల వైఫల్యం కాదా? దీనివల్ల పోలీసుల ప్రతిష్ట మసకబారదా?