రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది

Spread the love

 పోలీసులు అన్నీ అబద్ధాలు చెబుతున్నారు- చంద్రబాబు

టీడీపీ కార్యకర్తలపై దాడిలో వైసీపీ పాత్ర గురించి ఎందుకు చెప్పడం లేదు?- పోలీసుల అసమర్థతకా ఈ బంద్?ప్రశాంతంగా సాగే చంద్రబాబు గారి టూర్ విఫలం చేయడానికి ముఖ్యమంత్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుట్ర పన్నారు- కుట్ర పన్నిన జగన్మోహన్ రెడ్డిని ఏ-1, పూర్తిగా సహకరించిన కాబోయే ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలిః వర్ల రామయ్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది. శాంతిభద్రతలను పూర్తిగా క్షీణించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖ పనిచేయాలంటే, వారి విద్యుక్త ధర్మాన్ని వారు నిర్వర్తించాలంటే స్థానిక వైకాపా నాయకుల అనుమతి కావాల్సిన దుర్భర పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. మా పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు 10 రోజులు నీటిపారుదల ప్రాజెక్టులు విజిట్ చేస్తారని డీజీపీ, సంబంధిత అధికారులకు మేం ముందే సమాచారం ఇచ్చాం.

సెక్యూరిటీ ఎరేంజ్ మెంట్స్ చేయమన్నాం. చంద్రబాబు గారికి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందని చెప్పాం. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 45 ఏళ్లు సుదీర్ఘ రాజకీయ చరిత కలిగిన వ్యక్తి. ఆయనకు అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తుంటే పోలీస్ శాఖ ఏం చేస్తోంది. ఈ రోజు నంగనాచిలాగా చిత్తూరు ఎస్పీ, అనంతపూర్ డీఐజీ మాట్లాడుతున్నారు. పోలీసులను అటాక్ చేయడానికే చంద్రబాబు పర్యటనకు వచ్చారని చెప్పడం హాస్యాస్పదం. పోలీసు అధికారిగా మీ విద్యుక్త ధర్మం ఏంటి? చంద్రబాబు గారు వస్తుంటే.. ఆ రూట్ ను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన బాధ్యత మీది కాదా?

చుట్టపక్కల ఏమైనా ఉన్నాయా, చంద్రబాబు గారికి ప్రాణానికి హాని ఏమైనా ఉందా, అసాంఘిక శక్తులు ఏమైనా రోడ్డుమీదకు వస్తున్నాయా అని వారిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీది కాదా?
ఘటనలో వైసీపీ నేతల పాత్ర గురించి ఎందుకు చెప్పడం లేదు? డీఐజీ అన్నీ అబద్ధాలు చెబుతున్నారు. అమ్మిరెడ్డి గారు నోరు తెరిస్తే అబద్ధాలు.

ఆయన ఖాకీ బట్టలు వేసుకున్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ వాది. ఖాకీ బట్టలు వేసుకుని ఐపీఎస్ బిళ్లలు పెట్టుకున్న వైకాపా నాయకుడు ఆయన. పోలీసు అధికారిగా ఆయనను మేం భావించడం లేదు. చంద్రబాబు గారు టూర్ అంతా సాగునీటి ప్రాజెక్టులు సందర్శించడానికి కాదు.. పోలీసులపై అటాక్ చేయడానికి అన్నట్లుగా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు.

అసలు వైకాపా నాయకులను ఎందుకు రోడ్డుపైకి రానిచ్చారు? అదే జగన్ రెడ్డి వస్తుంటే మేం రోడ్డుపైకి వస్తుంటే ఒప్పుకుంటారా? వారందరినీ ప్రివెంట్ అరెస్ట్ ఎందుకు చేయలేదు, హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదు? యంగ్ ఎస్పీ ఫన్నీగా మాట్లాడుతున్నారు. ఆయన ఎంత కరకుగా ఉండాలి? ఏ పార్టీ అయినా తప్పు చేస్తే తోలుతీస్తానని మాట్లాడాల్సిన వాళ్లు.. వైకాపా మాకు ముద్దు..

తెలుగుదేశం మాకు వద్దు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. యంగ్ ఐపీఎస్ ఆఫీసర్.. ఈ రకంగా మీకు ముద్రపడితే భవిష్యత్ లో మీరు ఏం చేస్తారు విశ్రాంత్ రెడ్డి గారు? పాత్రికేయులు అడిగితే కూడా సీరియస్ అవుతున్నారు ఆయన. మీరు పబ్లిక్ సర్వెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. మీకింద బానిసలు, సేవకులు కాదు పబ్లిక్. వాళ్లిద్దరు గాడి తప్పారు. అసలు వైసీపీ వాళ్లు అక్కడ లేరు, అక్కడకు రాలేదు, కనపడలేదు అని చెబుతున్నారు. వైసీపీ వాళ్ల రోల్ ఏంటో మీరు చెప్పారా? అంటే సంఘర్షణ పోలీసులకు, టీడీపీ వాళ్లకా? వాట్ ఈజ్ దిస్ ఫన్నీ థింగ్. వైసీపీ వాళ్లు నల్ల చొక్కాలు పట్టుకుని వచ్చారు, వైసీపీ వాళ్లు జెండాలు పట్టుకుని వచ్చారు, వైసీపీ వాళ్లు రాళ్లేశారు.

15, 20 మంది మా వాళ్లకు దెబ్బలు తగిలాయి. సీరియస్ ఇంజురీస్ అయ్యాయి. బెడ్ పైన ఉన్నారు.వైసీపీ వాళ్లతో దగ్గరుండి పోలీసులు రాళ్లు వేయించారు. అసలు వైసీపీ వాళ్లు రావడం మీ అసమర్థత కాదా? చేతగానితనం కాదా? మీరు కావాలని వైసీపీ మద్దతు పలకలేదా? అసలు ఎందుకు వారిని ఇళ్ల వద్దనే అరెస్ట్ చేయలేదు? నన్ను ఎన్నిసార్లు నిర్బంధించారో? అసలు వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదు? చట్టం వారికి వర్తించదా? ఇద్దరు సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ మాట్లాడినదానికి నవ్వుకుంటున్నారు.

బంద్ కు పిలుపునిస్తే నవ్వుకోరా? మీ పోలీసుల అసమర్థతకా ఈ బంద్? మీ వైసీపీ నాయకులను ముందస్తు అరెస్ట్ లు చేయనందుకా ఈ బంద్? చంద్రబాబు గారి టూర్ సక్రమంగా సాగటానికి తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకా ఈ బంద్? మీ ప్రభుత్వం చంద్రబాబు గారికి కావాల్సినంత రక్షణ ఇవ్వకుండా ఘోరంగా విఫలమైనందుకా ఈ బంద్? మీ వైకాపా కార్యకర్తలు విజయవంతంగా టీడీపీ కాన్వాయ్ మీద, చంద్రబాబునాయుడు గారి మీద రాళ్ల దాడి చేసినందుకా ఈ బంద్? పోలీసులు సమాధానం చెప్పాలి.

పోలీసులు దగ్గరుండి ఎందుకు సహకరిస్తున్నారు? ఇవన్నీ మీ ఘోర వైఫల్యాలకు నిదర్శనాలు. ప్రెస్ లో పాత్రికేయుల మీద కన్రెర్ర చేస్తున్నారు. యంగ్ ఎస్పీ గత చరిత్ర కూడా చూస్తే మనకు అర్థమవుతుంది. ఏఎస్పీగా ఉన్నప్పుడు అన్నీ తప్పులు చేశారట. మీ చరిత్ర మేం తీస్తాం. పోలీసుల మీద ఎవరు దాడి చేశారు? వైకాపా నాయకులు చూపించిన 200, 300 మంది వరకు తీసుకెళ్లారు. ఎంత అరచకం సృష్టిస్తున్నారు.

ప్రశాంతంగా సాగే చంద్రబాబు గారి టూర్ విఫలం చేయడానికి ముఖ్యమంత్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుట్ర పన్నారు. ఎప్పుడైతే పులివెందులలో చంద్రబాబు గారికి బ్రహ్మరథం పట్టారో అప్పటి నుంచి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. అంగళ్లలో విధ్వంసం సృష్టించింది మీరు కాదా? పుంగనూరులో వైసీపీ కార్యకర్తలను ఎందుకు బయటకు రానిచ్చారు, వాళ్లు రాళ్లేస్తుంటే పోలీసులు ఎందుకు చోద్యం చూస్తున్నారో సమాధానం చెప్పగలరా? చంద్రబాబు గారికి రాళ్లు తగలకుండా ఎన్ఎస్ జీ కమాండోలు ప్రొటెక్టింగ్ గార్డ్స్ అడ్డుపెట్టలేదా? అర్థంపర్థం లేని ప్రెస్ మీట్ లు పెడుతున్నారు.

ఎఫ్ఐఆర్ లో అదర్స్ అని పెట్టి అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. పెద్దిరెడ్డి నంగనాచిలా మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఎప్పుడన్నా ఎదుటి మనుషులపై దాడి చేయమని చెప్పారా? ఆ చరిత్ర మీకే సొంతం. చంద్రబాబు ఆయుధాలతో వచ్చారని చెప్పడం సిగ్గుచేటు. కుట్ర పన్నిన జగన్మోహన్ రెడ్డిని ఏ-1, పూర్తిగా సహకరించిన కాబోయే ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. గవర్నర్ గారిని కలిసి అంతా వివరించడం జరిగింది. తప్పకుండా రిపోర్ట్ తెప్పించుకుంటామని చెప్పారు.

చంద్రబాబు గారి నందిగామ పర్యటనలో ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధు గారిపై రాళ్ల దాడి జరిగితే.. ఏ ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? ఆయన పోలీస్ ఆఫీసర్ కాదా? ఈ వివక్ష ఏమిటి? యర్రగొండపాలెంలో ఎన్ఎస్ జీ కమాండో సంతోష్ కుమార్ కు దెబ్బలు తగిలాయి. ఆయన పోలీస్ ఆఫీసర్ కాదా? పెద్దిరెడ్డి అడుగులకు మడుగులొత్తో వారే పోలీసులా? దాడి చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదా? తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వేధింపులు భరించలేక దళిత వర్గానికి చెందిన సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారా, అతడు పోలీసు ఆఫీసరు కాదా? సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ లో వైకాపా రౌడీషీటర్ దళిత ఎస్ ఐ పై దాడిచేస్తే ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పటికైనా కళ్లు తెరవండి. చంద్రబాబు గారి మిగతా పర్యటన ప్రశాంతంగా జరిగేలా చూడాలి. మీరు చేసే అక్రమాల చిట్టా తయారవుతుందని హెచ్చరిస్తున్నాం. డీజీపీ పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లైనా టీడీపీ వాళ్లెవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. వైసీపీ వాళ్లు వస్తే లేచి ఎదురెళ్లి స్వాగతం పలుకుతున్నారు. డీజీపీ గారి సేవలు కేవలం వైసీపీ వారికే అందుతాయట? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి

 

Leave a Reply