-నిధులు లేక కేంద్రాన్ని అడుక్కుంటున్నారు
– మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవా
అప్పులకుప్పగా మారిన ఆంధ్రా సర్కారు పరిస్థితిపై తెలంగాణ సర్కార్ ఎద్దేవా చేసింది. అప్పుల కోసం జగన్ సర్కారు కేంద్రం వద్ద బిచ్చమెత్తుకునే దుస్థితికి చేరిందని వ్యంగ్యాస్త్రం సంధించింది. తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రానికి సాగిలబడుతున్న జగన్ సర్కారు విధానాన్ని తూర్పారపట్టారు.
తెలంగాణ వస్తే అడుక్కుతింటామని ఆరోజు ఆంధ్రోళ్లన్నారని, ఈ రోజు జగన్ బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. అందుకే మోటార్లకు మీటర్లు పెడుతున్నారని విమర్శించారు. నిధులు లేక జగన్ కేంద్రాన్ని అడుక్కుతింటున్నారని ఎద్దేవాచేశారు. తెలంగాణ వస్తే అడుక్కుతింటామని ఎద్దేవా చేసినవారే.. బిచ్చమెత్తుకుంటున్నారని తెలిపారు. ఏపీ నడవాలంటే కేంద్రం నిధులు కావాలన్నారు. కేంద్రం ఒత్తిడితోనే ఏపీలో మోటార్లకు మీటర్లు పెట్టారని ప్రశాంత్‌రెడ్డి తూర్పారపట్టారు.