Suryaa.co.in

Telangana

సీజనల్ వ్యాధుల కట్టడిపై మంత్రి రాజనర్సింహ సమీక్ష

హైదరాబాద్: రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో సీజనల్ వ్యాధుల కట్టడిపై అన్ని జిల్లాల జిల్లా వైద్యాధికారుల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల, డెంగ్యూ కట్టడిపై హెచ్ ఓ డి, జిల్లా స్థాయిలో డి ఎం హెచ్ వో లు క్షేత్రస్థాయిలో పర్యటించి తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారు.

ELISA TEST చేయకుండా RAPID TEST ద్వారా డెంగ్యూ వ్యాధిని నిర్ధారణ (కన్ఫర్మేషన్) చేసి ప్రజలను ఆందోళనలకు గురిచేసే ఆసుపత్రులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. డెంగ్యూ వ్యాధిపై జరుగుతున్న అసత్యపు ప్రచారం పై నిఘ పెట్టాలని మంత్రి ఆదేశించారు.

సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా ఇంటింటి జ్వర సర్వేని నిర్వహించి బాధితుల రక్త నమూనాలను సేకరించి వారికి మెరుగైన వైద్యాన్ని అందించేలా చర్యలు చేపట్టామన్నారు. సీజనల్ వ్యాధుల, డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు అయ్యే హై రిస్క్ ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలను చేపట్టాలని మంత్రి ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మురికి నీటి నిల్వ కుంటలలో, చెరువులలో ఆయిల్ బాల్స్ లను వెయ్యాలని మంత్రి అధికారులకు సూచించారు.

సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు సీజనల్ వ్యాధుల రిపోర్ట్ ను ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు అందించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ పై ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు.

.రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తోపాటు నర్సింగ్ కాలేజీలలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అవసరమైన అధునాతన ఎక్విప్మెంట్ సమకూర్చడంపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలతో పాటు నర్సింగ్ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పన కు, అధునాతన ఎక్విప్మెంట్ సమకూర్చడం పై దృష్టి సారించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ వాసుదేవరావు ను ఆదేశించారు.

అనంతరం , రాష్ట్రంలో జరుగుతున్న జీవన్ దాన్ కార్యక్రమంలో భాగంగా అవయవ మార్పిడి పై చర్చించారు. జీవన్ దాన్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రోత్సహించేలా అవగాహన చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జీవన్ దాన్ కార్యక్రమం లో భాగంగా అవయవ మార్పిడి పై రూపొందించిన అంశాలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చోoగ్తూ, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్ వి కర్ణన్, TGMSIDC – MD హేమంత్ వాసుదేవ్ రావ్ , రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ కుమార్, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణి, వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE