Suryaa.co.in

Telangana

గీత కార్మికుల 12 కోట్ల 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను విడుదల చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

-గీత వృత్తిలో ప్రమాదానికి గురైన గీత కార్మికులకు 12 కోట్ల 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియో నిధులను విడుదల చేసిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
– తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల తర్వాత చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియో ను పంపిణీ చేస్తామని మంత్రి వెల్లడి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌడ వృత్తిదారుల ఆత్మగౌరవానికి కేటాయించిన ఎంతో విలువైన కోకాపేటలోని 5 ఎకరాలలో నిర్మిస్తున్న ఆత్మగౌరవ భవన నిర్మాణానికి జరిగే భూమి పూజ కార్యక్రమంలో గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియో ను పంపిణీ చేస్తున్నాం. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గీత కార్మికులకు రైతు బీమా మాదిరిగా ఎక్స్ గ్రేసియో అందించాలని ఆదేశించారు.

ఇకపై గీత కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భీమా మాదిరిగా ‘గీత కార్మికుల భీమా’ ను రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అమలు చేస్తున్నాం. కేసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రోహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రమాదవశాత్తు తాటి, ఈత చెట్లపై నుండి పడి మరణించిన, శాశ్వత అంగ వైకల్యం చెందిన గీత కార్మికులకు అందించే ఎక్స్గ్రేషియా నేరుగా వారి ఎకౌంట్ లలో వారం రోజుల వ్యవధిలో రైతు బీమా మాదిరిగా జమ చేస్తాం.

గీత కార్మికులు వారి ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు, లైసెన్సు వివరాలను, నామిని వివరాలను ఎక్సైజ్ శాఖ అధికారులకు అందజేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి గీత కార్మికులకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా గీత కార్మికులు వారి సమీపంలో ఉన్న ఎక్సైజ్ స్టేషన్లో వివరాలు వారం రోజుల వ్యవధి అందించాలని మంత్రి డాక్టర్ బి శ్రీనివాస్ గౌడ్ కోరారు.

ఎక్సైజ్ శాఖ అధికారుల వద్ద వివరాలు నమోదు చేసుకోని గీత కార్మికులకు ‘గీత కార్మికుల భీమా’ ను అందించడానికి వీలుకాదని త్వరగా గీత కార్మికులు ఎక్సైజ్ శాఖ అధికారులకు వివరాలు అందించాలని ఈ సందర్భంగా కోరారు . గీత కార్మికులకు రైతు బీమా మాదిరిగా గీత కార్మికుల భీమా రాష్ట్రం లో సమర్థవంతంగా అమలు అయ్యేలా విధివిధానాలు పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫారాజ్ అహ్మద్ ను ఈ సందర్భంగా ఆదేశించారు .

LEAVE A RESPONSE