చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలో జగనన్న క్రీడా సంబరాలు-2022ను మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. క్రీడా సంబరాలు ప్రారంభించిన అనంతరం మంత్రి రోజా కాసేపు క్రీడాకారులతో కలిసి
క్రికెట్ ఆడి క్రీడాకారులలో ఉత్సాహాని నింపారు. చిత్తూరు జిల్లా నుంచి కుప్పం, పలమనేరు, పుంగనూరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, నగరి నియోజక వర్గాలకు చెందిన క్రీడాకారులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. పిల్లలు అంటేనే మంచి నిష్కలమైన మనస్సులు గలవారు , నా పిల్లలకు నా శాఖ ద్వారా సేవ చేయడం, ఆనందంగా భావిస్తున్నాని అన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని చేతుల్లో పెట్టినా ఎలాంటి కుంటి సాకులు లేకుండా అభివృధికి కృషి చేస్తున్న వ్యక్తి మన సీఎం జగన్ అన్న అని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగిన ప్రతిపక్ష నాయకులు తట్టుకోలేకపోతున్నారని ఆమె మండిపడ్డారు.
వారికి పేద విద్యార్థుల పట్ల మంచి ఉద్దేశం లేకపోవడం… వారికి కావలసినది కార్పొరేట్ స్థాయి విద్యార్థులే. రాష్ట్రంలో టీడీపీ వాళ్ళు జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు చేస్తుంటే ఓర్వలేక పోతున్నారు, భజన అంటున్నారన్నారు. భజన అంటే ఎలా ఉంటుంది అంటే వైఎస్సాఆర్ కట్టిన పోలవరం ప్రాజెక్ట్ దగ్గరకు 100 కోట్లు ఖర్చు చేసి జయం జయం చంద్రన్న అంటూ వృధా చేశారు ఇది భజన అంటూ వ్యంగంగా మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డెప్ప, చిత్తూరు జే.సి. వెంకటేశ్వర్, నగరి, పుత్తూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్ లు, పంచాయితీ సర్పంచులు, ఎంపీటీసీలు వైఎస్సార్ సీపీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.