Suryaa.co.in

Andhra Pradesh

తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి రోజా ఫొటోగ్రాఫర్‌

తిరుమల: తిరుమలలో మంత్రి రోజా వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌ నిబంధనలు ఉల్లంఘించారు. వివరాల్లోకి వెళితే.. వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకునేందుకు మంత్రి రోజా వచ్చారు.ఆమెతో పాటు తన వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌ను కూడా తీసుకొచ్చారు.

ఈ క్రమంలో ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్‌ స్టెయిన్‌ అన్యమత గుర్తు ఉన్న గొలుసుతో గొల్లమండపం ఎక్కారు. స్టెయిన్‌ పట్ల అక్కడి భక్తులు అసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి వారిని అదుపులో ఉంచాల్సిన మంత్రి.. ఏమాత్రం పట్టించుకోకుండా శ్రీవారి ఆలయం వద్ద ఫొటోలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు. తిరుమల కొండపై అన్యమత గుర్తుల ప్రదర్శనపై నిషేధం ఉంది. అయినప్పటికీ ఫొటోగ్రాఫర్‌ ఇలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి..

LEAVE A RESPONSE