అదిరిపోయేలా విజయవాడ ఉత్సవ్
– సన్నాహక సమావేశంలో వక్తలు
విజయవాడ: స్థానిక ఫార్చ్యూన్ మురళి హోటల్ లో విజయవాడ ఉత్సవ్ సన్నాహక సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ చైర్మన్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. విజయవాడ ఉత్సవాలను దిగ్విజయం చేయడంపై ప్రజాప్రతినిధులు అందరితో చర్చించారు. అందరి సలహాలు, సూచనలు తీసుకొని ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.
11 రోజులపాటు ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించబోతున్నాం… అంతరించిపోతున్న కళలను పరిరక్షించుకుంటూ వేడుకలు నిర్వహిస్తాం.. ప్రజలను ఇందులో మమేకం చేస్తాం.. దసరా అంటే ప్రజలకు విజయవాడ వెళ్లాలనిపించేలా ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం.. విజయవాడ చరిత్ర అందరికీ తెలిసేలా చేస్తామని తెలిపారు.
అమ్మవారి భక్తులకు, విజయవాడ నగరం ప్రాముఖ్య, కళల రాజధాని, సాంస్కృతిక రాజధాని గురించి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వినోదాన్ని, ఆధ్యాత్మికత పెంచేలా కార్యక్రమాలు ఉండబోతున్నాయి. కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయ అధికారులతో మాట్లాడి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మైసూర్ తరహాలో విజయవాడ ఉత్సవ్ ను నిర్వహించబోతున్నామని చెప్పారు.
అనంతరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్య కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ప్రజా ప్రతినిధుల అందరితో కలిసి కేక్ కట్ చేపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.