Suryaa.co.in

Andhra Pradesh

గ్యాంగ్ రేప్ బాధితులను పరామర్శించిన మంత్రి సవిత

– గత ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే ఇలాంటి సంఘటనలు
– ఏపీ ప్రభుత్వం గంజాయి పై ఉక్కు పాదం మోపుతోంది
– మంత్రి సవిత

హిందూపురం: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం నల్ల బొమ్మిని పల్లి గ్రామ సమీపంలోఉపాది కోసం వలస వచ్చిన కుటుంబంపై, దుండగుల చేతిలో అత్యాచారానికి పాల్పడ్డ అత్త మరియు కోడలు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన మంత్రి సవిత అధైర్య పడకండి.. మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని పరామర్శించారు.

అనంతరం మీడియా తో మంత్రి సవిత మాట్లాడుతూ
ఈ ఘటన పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వగలపూడి అనిత, స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీరియస్ గా తీసుకున్నారు. అమాయక మహిళలపై అతి దారుణమైన చర్య జరిగింది,గత ప్రభుత్వం వైఫల్యాల కారణంగానే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

గత ఐదేళ్లలో గంజాయిని ప్రోత్సహించింది ఎవరో అందరికీ తెలుసునని గంజాయి వల్ల యువత పెడదారి పడుతోంది. ఏపీ ప్రభుత్వం గంజాయి పై ఉక్కు పాదం మోపుతోందని మంత్రి సవిత తెలియచేసారు. ఘటన జరిగి 24 గంటలు గడవకనే పోలీస్ లు నిందితులను పట్టుకున్నారని, మొత్తం 6 గురు నిందితులు ఘటనలో ఉన్నారని.. వారంతా గంజాయికి అలవాటు పడినవారని అనేక కేసుల్లో నిందితులుగా ఉండి, జైళ్లకు కూడా వెళ్ళొచ్చారని పోలీసుల విచారణలో తెలుస్తున్నాయని తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొల్లకుంట ఆంజినప్ప , రాష్ట్ర కార్యదర్శి రామాంజినమ్మ ,హిందూపురం పట్టణ అధ్యక్షులు డి ఈ రమేష్ స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE