Suryaa.co.in

Telangana

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలి

మహబూబ్ నగర్ లో బహిరంగంగా గాల్లో కాల్పులు జరిపిన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ,రాష్ట్ర ముఖ్యమంత్రినీ డిమాండ్ చేసారు.

తిరంగా ర్యాలీలో మంత్రి గాల్లో కాల్పులు జరిపిన విషయం పై ఘాటుగా స్పందించారు.అసలు తెలంగాణ లో పోలీసు వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు. తాను క్రీడా మంత్రినీ , కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని మంత్రి చెప్పడం సిగ్గుచేటు. అయితే తన వెంట ఉన్న భద్రతా సిబ్బంది వాడుతుంది రబ్బర్ బుల్లేటా అని డీకే అరుణ ఎద్దేవా చేసారు. తెలంగాణ లో తెరాస నాయకుల ఆగడాలు తారా స్థాయికి చేరాయని, వారిని నియంత్రించాల్సిన పోలీసులు భజన చేస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. మంత్రికి అడుగులకు మడుగులు ఒత్తుతూ పోలీస్ సిబ్బంది మంత్రినీ సమర్దిస్తూ పోలీస్ శాఖను కించపర్చుతున్నారని, జిల్లా ఎస్పి తనను తుపాకీ తో గాల్లో కాల్చుమని చెప్పాడని, స్వయాన మంత్రి చెప్పిన విషయాన్నీ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పరిగనంలోకి తీసుకొని అధికారినీ సస్పెండ్ చేయాలని డీకే అరుణ డిమాండ్ చేసారు.

LEAVE A RESPONSE