రామచంద్రపురం : ఇంజనీరింగ్, డిప్లమా చదువుకునే విద్యార్థులకు లాప్టాప్ అవసరం ఎంతైనా ఉంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. మంగళవారం మంత్రి సుభాష్ వ్యక్తిగత సిబ్బంది డ్రైవర్ అప్పలరాజు కుమార్తె దేవికకు లాప్టాప్ అందించారు.
డ్రైవర్ అప్పలరాజు కుమార్తె దేవిక డిప్లొమాలో కంప్యూటర్ సైన్స్ చదువుకుంటుంది. చదువుకునే విద్యార్థులకు నిత్యం తోడ్పాటు అందించే మంత్రి సుభాష్ గారు విద్యార్థిని యొక్క అవసరాన్ని తెలుసుకొని లాప్టాప్ ను బహుమతిగా అందించారు.
టెక్నాలజీ ద్వారా మేధాశక్తిని పెంపొందించుకొని మంచి ఫలితాలు సాధించి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని దీవించారు. విద్యకు సంబంధించిన ఏ అవసరం వచ్చిన తాను సహకరిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం గారు కూడా దేవికకు ఆశీస్సులు అందజేశారు.