Suryaa.co.in

Telangana

మలేషియాలో విత్తన కేంద్రాన్ని సందర్శించిన మంత్రి తుమ్మల

మలేషియా: తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు FGV కంపెనీ సీడ్ గార్డెను, నర్సరీలను, అధునాతన సాంకేతిక పద్దతులతో నడపబడుతున్న విత్తన కేంద్రాన్ని సందర్శించి, కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు.

FGV కంపెనీ నుండి తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే Seedlings ను చాలా వరకు తెప్పించడం జరిగిందని, భవిష్యత్తులో రాష్ట్రంలోనే స్వంతముగా సీడ్ గార్డెన్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామని, దానికి FGV కంపెనీ వారి సహాయ సహకారాలు అందజేయాలని కోరగా, దానికి కంపెనీ ప్రతినిధులు తప్పకుండా రాష్ట్ర భాగస్వామ్యంతో పని చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.

FGV కంపెనీ రిఫైనరీ కర్మాగారాన్ని సందర్శించి అక్కడ తయారు చేసే వివిధ ఉత్పత్తులను పరిశీలించారు. రిఫైనింగ్ సమయములో కంపెనీ వారు తీసుకొనే జాగ్రత్తలు, వివిధ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా గల డిమాండ్ గురించి సోదాహరణంగా మంత్రితో పాటు అధ్యయన బృందానికి తెలిపారు.

LEAVE A RESPONSE