ఏపీయుడబ్ల్యూ జే డిమాండ్
రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ జర్నలిస్టులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ,( ఏపీయుడబ్ల్యూ జే) ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU )డిమాండ్ చేశాయి. ఆ మేరకు APUWJ రాష్ట్ర అధ్యక్షులు IV సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, IJU ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
మంత్రి వేణుగోపాల కృష్ణ మంగళవారం బాధ్యతలు తీసుకున్న తరువాత మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలకోసం సీఎం జగన్ నీ ఆరాధించాలే కానీ ఆరా తీయకూడదు అంటూ వ్యాఖ్యానించటం ఆయన అవివేకానికి నిదర్శమన్నారు రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడం సమంజసం కాదన్నారు.
మంత్రి వ్యాఖ్యల పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని APUWJ కోరింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రి జర్నలిస్టుల సమస్యలను పరిశీలించి ,పరిష్కార చర్యలు తీసుకోకపోగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు.
సీఎం జగన్ జర్నస్టులకు ఇచ్చిన ఇళ్ళ స్థలాల హామీ నేటికీ అమలు కాలేదాని, అక్రిడేషన్ల జారీలో సమాచార శాఖ అనుసరించిన నూతన విధానంతో వేలాది మంది జర్నలిస్టులు కనీస గుర్తింపు కార్డుకు నోచుకోలేదు.ఇంకా అనేక సమస్యలు అపరిష్కతం గానే ఉన్నాయి. వాటి పై దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించాలని కోరారు.
ఆ విషయాన్ని పట్టించుకోకుండా జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతినేలా మంత్రి వ్యాఖ్యానించడం గర్హనీయం అన్నారు.తక్షణమే మంత్రి మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోని జర్నలిస్టులకు క్షమాపణ చెప్పి, వారి సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని సూచించారు. లేని పక్షంలో జర్నలిస్టుల నిరసన ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించారు