భక్తులకు – భగవంతుని దర్శనం కల్పించడంలో టీటీడీ విఫలం

-ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మండిపాటు

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులలో టోకెన్లు ఉన్న వారిని కొండపైకి అనుమతించి టోకెన్లు లేని ఉచిత దర్శనం కోసం వెళ్లే భక్తులను అలిపిరి వద్ద నిలిపివేయడం ద్వారా నేటి ఉదయం జరిగిన తొక్కిసలాటకు టీటీడీ అధికారుల అనాలోచిత చర్యలకు అద్దం పడుతోందని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తీవ్రంగా మండిపడ్డారు.

అలిపిరి దగ్గర శ్రీవారి ఉచిత దర్శనానికి టోకెన్లు జారీ, కోవిడ్ సమయంలో ప్రవేశపెట్టిన విధానం ఇంకా కొనసాగటాన్ని వీర్రాజు తప్పుబట్టారు.టీటీడీ అధికారులు అవగాహనా రాహిత్యం వల్లనే నేటి ఉదయం జరిగిన తొక్కిసలాట, సృహతప్పి భక్తులు పడిపోయారనిఆక్షేపించారు.

టీటీడీ తీసుకున్న నిర్ణయం భక్తులకు శరాఘాతంగా మారిందని, వెంటనే ఏలాంటి టోకెన్లు లేకున్నా కూడా,భక్తులందరూ తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే అవకాశం కల్పించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.టీటీడీ పాలకమండలి వెంటనే తన పూర్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, కానిపక్షంలో తానే భక్తులతో సహా ఎలాంటి టోకెన్లు లేకుండా తిరుమల యాత్ర నిర్వహిస్తానని సోము వీర్రాజు హెచ్చరించారు.

గతంలో వైకుంఠ ఏకాదశి / ఇతర పర్వ దినాల్లో, 4, లేక 5 లక్షల మంది భక్తులు భారీగా తరలివచ్చిన సందర్భాల్లో కూడా ముందస్తుగా ఏర్పాట్లు చేసిన టీటీడీ నేడు ప్రతి సందర్భంలో కూడాఎందుకు వైఫల్యం చెందుతోందో చైర్మన్ జవాబు చెప్పాలని సోము వీర్రాజు ప్రశ్నించారు.

రాష్ట్రములోని వైసీపీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా భగవంతుణ్ణి – భక్తులకు దూరం చేసి, ధర్మ విరుద్ధంగా వ్యవహరిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.టీటీడీ తీరు మారకుంటే భక్తులతో కలసి ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

Leave a Reply