పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, జిల్లా వైద్యాధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా రోగుల వద్దకు వెళ్లి.. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలోని సిబ్బంది పనితీరును అడిగి
తెలుసుకున్నారు. మెడికల్ స్టోరుకి వెళ్లి అక్కడున్న మందుల్ని పరిశీలించారు. ఆస్పత్రి మొత్తం కలియతిరిగారు. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా పనిచేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే.. చర్యలు తప్పవని స్పష్టం చేశారు.