– కొత్తపేట నియోజకవర్గంలో స్త్రీ శక్తి పథకం ప్రారంభంలో ఆసక్తికర పరిణామం
– స్త్రీ శక్తితో మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధ్యం
– ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
రావులపాలెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు పథకం రావులపాలెంలో ప్రారంభం సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభానికి విచ్చేసిన ఎమ్మెల్యే బండారు రావులపాలెం నుంచి ముక్కామల వరకూ బస్సు లో ఆర్డీవో శ్రీకర్ తో కలిసి ప్రయాణించారు.
ఈ సందర్భంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కండక్టర్ అవతారం ఎత్తారు. ముందుగా తాను టిక్కెట్టు కొనుక్కుని తర్వాత బస్సులో ప్రయాణిస్తున్న ప్రతి మహిళకు స్త్రీ శక్తి జీరో టికెట్ తానే స్వయంగా అందజేశారు.
మహిళలతో ఉచిత బస్సు పథకం యొక్క ప్రయోజనాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వద్ద ఉచిత బస్సు పథకంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.