Suryaa.co.in

Andhra Pradesh

ఎమ్మెల్యే బొల్లా నంబర్ వన్ చీటర్

-161 కోట్ల త్రాగునీటి పథకం పూర్తి చేయలేని అసమర్ధ ఎమ్మెల్యే బొల్లా
-దొండపాడు చెరువు నుండి కలుషిత నీరు సరఫరా
-ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న బొల్లా..
-అమాయకుల ప్రాణాలు తీసిన బ్రహ్మనాయుడు
-ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి నిధులు తీసుకురాని దద్దమ్మ..
-టిడిపి హయాంలో నిలిచిపోయిన పనులు చేసి గఫ్ఫాలు కొడుతున్న నటబ్రహ్మ
-అభివృద్ధిపై బహిరంగ చర్చకు మేము సిద్ధం
-దమ్ముంటే చర్చకు రావాలని ఎమ్మెల్యేకి ప్రతిపక్ష నేతలు జీవి, మక్కెన సవాల్

పల్నాడు జిల్లా,వినుకొండ: ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నెంబర్-1 చీటర్ అని, టిడిపి పాలనలో నిలిచిపోయిన పనులు చేసి అన్ని తానే చేస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాడని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు. గురువారం వినుకొండలోని జీవి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన, మరో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జనరావుతో కలసి విలేకరులతో మాట్లాడారు.

ఐదేళ్లలో వినుకొండ అభివృద్ధికి ఒక రూపాయి కూడా తీసుకురావాలని అసమర్ధ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అని, తమ హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని అన్నారు. దమ్ముంటే ఎమ్మెల్యే చర్చకు రావాలని ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు సవాల్ విసిరారు.

వినకొండ లో నెలకొన్న తీవ్ర తాగునీటి ఎద్దడిని దగ్గరగా చూసి ప్రజల త్రాగునీటి కష్టాన్ని శాశ్వతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో, నాడు తాను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత త్రాగునీటి పథకానికి 161 కోట్లు నిధులు తీసుకురావడం జరిగిందని అన్నారు.

ఎంతో కష్టపడి తాము తాగునీటి పథకాన్ని తీసుకువస్తే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన స్వార్థం కోసం పథకం పూర్తి చేయకుండా ప్రజలకు అన్యాయం చేశారన్నారు.పైపులైన్ నిర్మాణం చేపడుతుండగా ఎమ్మెల్యే కమిషన్ల కోసం చేసిన డిమాండ్ కు కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసి వెళ్లిపోవడంతో పైపులు పరికరాలు అన్ని నిరుపయోగంగా మారాయన్నారు. తిమ్మాయపాలెం రోడ్డు, కాల్వగంటపై సిసి రోడ్లు తదితర అభివృద్ధి పనులను నాడు మా హయాంలో తీసుకువచ్చి ప్రారంభించినవేనని తెలిపారు.నాగార్జునసాగర్ డ్యాం లో త్రాగునీరు కూడా లేని సమయంలో సమర్థవంతంగా వినుకొండ పట్టణ ప్రజలకు ప్రభుత్వం ,సొంత నిధులు ఖర్చు చేసి త్రాగునీటి సమస్య తలెత్తకుండా నాడు చేయడం జరిగిందన్నారు.

రూ.20 లక్షలతో చెరువు కట్టలు వెడల్పు చేసి 60 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపి, అనధికారికంగా మున్సిపల్ ప్రజాధనాన్ని 40 లక్షల దోచుకుంది నీవు కాదా? అని ప్రశ్నించారు. ఆరు నెలల్లో వరికపూడిసెల పూర్తి చేస్తానని ప్రజలను నమ్మించి దగా చేసిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు.ప్రాజెక్టు నిర్మాణం అనుమతులకై ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్ లో అనేకసార్లు చర్చించి అటవీశాఖ అనుమతులు తెచ్చారన్నారు. వరికపూడిసెల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం పర్యావరణ అనుమతులు కూడా ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. మూగచింతల పాలెం డీప్ కట్ నుండి పైప్ లైన్ వేసి చెరువులు నింపి త్రాగునీరు సరఫరా కై 12 కోట్లు నిధులు ఇస్తానని సీఎం హామీ ఇచ్చి ఏడాది అయిన నేటికీ నెరవేర్చలేదన్నారు.

తన అవినీతి అక్రమ సంపాదనకై, స్వార్థ రాజకీయం కోసం ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ దొండపాడు నుంచి కలుషిత నీటిని వినుకొండ పట్టణ ప్రజలకు సరఫరా చేయటం అత్యంత దారుణం అన్నారు.గ్రామాల్లో కట్టిన సచివాలయాలు, హెల్త్ సెంటర్లు, ఆర్బీకేలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులని, రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక రూపాయి కూడా నిధులు తీసుకురాలేని సమర్థ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అని వినుకొండ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు.25 ఏళ్లగా అనేక సేవా కార్యక్రమాలతో ప్రజాదరణ పొందిన శివశక్తి లీల అండ్ అంజన ఫౌండేషన్ ను నోటికి వచ్చినట్లు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేస్తున్న విమర్శలను వారు తీవ్రంగా ఖండించారు.సేవ చేయటం చేతగాని బ్రహ్మనాయుడు ఫౌండేషన్ సేవలను విమర్శించడం దుర్మార్గం అన్నారు.

వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ నలుగురు సీఎం ల చేతుల మీదుగా ఉత్తమ కంపెనీగా శివశక్తి ప్రశంస అవార్డులు అందుకున్న చరిత్ర ఉందని, అటువంటి వ్యాపార సంస్థపై ఎమ్మెల్యే చేస్తున్న విమర్శలు అర్ధరహితమన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా నిరాధారణమైన ఆరోపణలు చేయటం బొల్లాకు తగదని, తన నిర్దోషిగా కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలుసుకోవాలని అన్నారు. తిరుమల డైరీ ఇండస్ట్రీలో జరిగిన కల్తీ పాల విక్రయాలు, మనుషులు చనిపోయిన కేసుల్లో బొల్లా బ్రహ్మనాయుడు ముద్దాయి అని, అతనిపై రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో కేసులు ఉన్నాయన్నారు. తిరుమల డైరీ వ్యవస్థాపకుడు ధూళిపాళ్ల సాంబశివరావు మానసిక క్షోభను అనుభవించి ఎవరి కారణంగా మరణించారో అందరికీ తెలిసిందేనని, అమరా ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవస్థాపకుడు అమరా వెంకటేశ్వర్లు ను కూడా వేధించి తన చావు కారణమైంది బొల్లా బ్రహ్మనాయుడు అని ఆరోపించారు.

మనుషులను చంపిన కేసులు, సింగపూర్ లో కూడా బ్రహ్మనాయుడు పై ఉన్నాయని, అతను హంతకుడై ఎదుటివారిని నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నమ్ముకున్న వైసిపి కార్యకర్తలను, నియోజకవర్గ ప్రజలను ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మోసం చేసిన నెంబర్-1 చీటర్ అని వ్యాఖ్యానించారు. పట్టణ అభివృద్ధికై, మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచేందుకు నాడు వందల కోట్లు విలువ చేసే ఎన్ఎస్ పి స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగిస్తే 400 షాపులు కట్టి వ్యాపారం చేసి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు దోచుకోవాలని ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. అభివృద్ధి అంశంపై ప్రజాక్షేత్రంలో చర్చకు తాము సిద్దమని, దమ్ముంటే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రావాలని జీవి ఆంజనేయులు ఈ సందర్భంగా సవాల్ విసిరారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మాట్లాడుతూ ఇలా వ్యక్తిగత విమర్శలు తగదన్నారు.

వైయస్సార్ ని తాము ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదని, చంద్రబాబు, వైయస్సార్ ఒకరినొకరు ఎంతో గౌరవంగా సంబోధించుకునే వారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడి దూషించడం తగదన్నారు. వెన్నపూస కాలనీ వివాదంలో నష్టపోయిన కుటుంబానికి రెండు ఎకరాలు పొలం, ఐదు లక్షల పరిహారం, కుటుంబంలో ఉద్యోగం నాడు మేము ఇవ్వటం జరిగింది అన్నారు. అలాంటి వెన్నపూస కాలనీ సంఘటనపై ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండిస్తూ, ఎఫ్ఐఆర్ పరిశీలిస్తే ముద్దాయిలు ఎవరో తెలుస్తుందని, వారంతా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చుట్టూ ఉన్నవారేనని స్పష్టం చేశారు.

బ్రాహ్మణులు అంటే మాకు ఎంతో గౌరవం అని అలాంటిది సంబంధం లేని అంశాలను ఆపాదించడం దుర్మార్గం అన్నారు. కాట్రగడ్డ రాధాకృష్ణ, బీసీ నరసింహారెడ్డి వారి భూములను లాక్కుంది నీవేనని, డ్రైవర్ గా ఉన్నప్పుడు ఎంతో మంది మనుషులను పొట్టన పెట్టుకున్నావని, అనేకమంది వ్యక్తులు మరణానికి కారకుడివైన నీకోసం వారి ఆత్మలు ఘోషిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో ఫీడ్ పెట్టకూడదని, చట్ట విరుద్ధంగా అన్ని చెరువుల్లో వల్లభ ఫీడ్ అందించి కోట్లు కొల్లగొడుతున్నది నీవు కాదా అని ఆరోపించారు.

ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు ఆపి అభివృద్ధిపై ప్రజాక్షేత్రంలో బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యేకి ఆయన సవాల్ విసిరారు. సమావేశంలో టిడిపి నాయకులు టిడిపి నాయకులు పటాన్ అయూబ్ ఖాన్, షమీంఖాన్, రాపర్ల జగ్గారావు, బత్తుల గోవిందరాజులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE