Suryaa.co.in

Andhra Pradesh

జనసేన కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా

విశాఖలో జరిగిన జనసేన నేత జన్మదిన వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్ల విజయ ప్రసాద్ హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఈ ఇద్దరు నేతలు సొంతపార్టీ కార్యక్రమాలకు దూరం అవుతూ వస్తున్నారు.

గంటాను టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు పక్కన పెట్టారు. ఆయనకు పెద్ద ప్రయారిటీ ఇవ్వడం లేదు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే విజయ్ ప్రసాద్ ను పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జ్ పదవి నుంచి అధిష్టానం తప్పించింది. ఆ స్థానం లో ఆడారి తులసీ రామ్ కు బాధ్యతలు అప్పగించారు.

కోర్టు కేసుల కారణంగా విజయ్ ప్రసాద్ ను తప్పించినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అసంతృప్తితో ఉన్న వీరిద్దరూ జనసేన వైపు చూస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది.. జనసేన నేత బొడ్డేపల్లి రఘు బర్త్

డే కార్యక్రమం లో కనిపించి రాజకీయ వేడి పుట్టించారు.

LEAVE A RESPONSE