Suryaa.co.in

Andhra Pradesh

మైనింగ్‌ అక్రమ రవాణాలో ఎమ్మెల్యేకు భారీ ముడుపులు

గురజాలలో ఇప్పటికే 800 ఎకరాలు బినామీలపాలు
అక్రమ రవాణా చేస్తున్నా పట్టించుకోని పోలీసులు
గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపణ

 

800ఎకరాల ప్రభుత్వ భూమిని బినామీల ద్వారా భూదందాకు ఎమ్మెల్యే అనుచర గణం రాయించుకుంది నిజం కాదా? నియోజకవర్గ పరిధిలో మూడు వేల ఎకరాలు, ప్రభుత్వ భూములు వైసీపీ నేతలు భూదందాకు హారతి కర్పూరంలా మాయమైపోయింది.నియోజకవర్గ పరిధిలో మద్యం, రేషన్, మైనింగ్ పెద్ద మాఫీగా మారిపోయింది. కోట్ల రూపాయల గ్రానైట్ ను మాఫియా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న పట్టించుకోని పరిస్థితి నెలకొంది…

రాబోయే రోజుల్లో భూ దందాలపై, మాఫియాపై టీడీపీ అధికారంలోకి రాగానే సిట్ వేసి భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటామని హెచ్చరించారు.గంజాయి స్మగ్లింగ్ విషయంలో పెద్ద స్కాం జరుగుతుంటే విద్యార్ద్యులను మత్తుకు బానిసలుగా చేసి వారి జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో మైనింగ్ మాఫియా ఆగడాలకు పలువురు ప్రాణాలు కోల్పోతే కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, విజిలెన్స్ అధికారులు కానీ పట్టించుకోని దుస్థితి ఏర్పడింది.
అవినీతి అహంకారం తో వైసీపీ నేతలు విర్రవీగుతున్నారు. రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పటానికి సిద్డంగా వున్నారు. వైసీపీ నేతలు ఇకనైనా తీరు మార్చుకొని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వైసీపీ బరితెగింపు విధానాలకు స్వస్తి చెబుతామని, న్యాయ పోరాటాలు చేస్తామని తెలిపారు.

 

LEAVE A RESPONSE