– మత విద్వేషాలను రెచ్చగొట్టడమే లక్ష్యం
– కోర్టుకు వివరించిన ఏజీ
ఎమ్మెల్యే రాజాసింగ్ పై నమోదైన పీడీ యాక్టు తీసివేసి స్వేచ్చ కలిగించాలని రాజా సింగ్ భార్య ఉషా బాయ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం. మొహమ్మద్ ప్రవక్తపై ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు వాస్తవమని దానికి సంబంధించిన వీడియోలు, ఆధారాలు పోలీసుల దగ్గర వున్నాయని ఏజీ కోర్టుకు వివరించారు.
రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలతో హైదరాబాద్ సహా తెలంగాణ ప్రాంతంలో మత ఘర్షణలు చెలరేగాయని ఏజీ తెలిపారు.రాజా సింగ్ పై 100 కు పైగా కేసులు నమోదై వున్నాయని, రెండు ముర్డర్ కాసుల్లోను నిందితుడిని ఏజీ కోర్టుకు చెప్పారు.
రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలతో విసుగుచెందిన సొంత బీజేపీనే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని తెలిపారు.రాజా సింగ్ కేసులను క్షుణ్ణంగా పరిశీలించిన డిటెన్షన్ అథారిటీ బయటకు వస్తే ఎం జరుగుతుందో గమనించి నివేదిక ఇచ్చిందని ఏజీ కోర్టుకు వివరించారు.
సుమారు రెండు గంటల పాటు అనర్గళంగా వాదించిన ఏజీ రాజా సింగ్ బయటకు వస్తే శాంతియుత సమాజ వాతావరణానికి విఘాతం కలుగుతుందని అన్నారు.కోర్టు సమయం అయిపోవడంతో తదుపరి విచారణను రేపు మధ్యహ్నానికి వాయిదా వేసిన హైకోర్టు ధర్మాసనం.