-కరోనా మహమ్మారితో అమ్మని పోగొట్టుకున్న ఆడబిడ్డకు అండగా నిలిచిన ఎమ్మెల్యే రోజా
నగరి నియోజకవర్గం పుత్తూరు మున్సిపాలిటీకి చెందిన హైమ, 42 సంవత్సరాలు ఏపీఎస్పీడీసీఎల్ పుత్తూరు విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగినిగా గత పది సంవత్సరాలుగా పనిచేస్తూ తను ఉద్యోగం చేస్తూ తన ఇద్దరు పిల్లలను చదివిస్తూ మరియు కుటుంబాన్ని పోషిస్తూ సెకండ్ వేవ్ లో కరోన బారినపడి మృతి చెందిన హైమా రాజు, ఆ కుటుంబం పెద్దని పోగొట్టుకుని చతికిలపడ్డ ఆ కుటుంబం పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆర్.కె.రోజా చాలా కలత చెందారు. వారి కుటుంబానికి నేను అండగా ఉంటానని ఇచ్చిన మాటకి వారికి మనోధైర్యం అందిస్తూ, ఆ కుటుంబం భవిష్యత్తుకు భరోసాగా ఆ కుటుంబానికి వెలుగు నింపడం కోసం ఆ తల్లి యొక్క పుత్రిక అయిన ఏ.ఎం.మౌనిక రాజుకు తన తల్లి ఉద్యోగం చేసిన విభాగంలోనే ఎమ్మెల్యే ఆర్ కె రోజా ప్రత్యేక శ్రద్ధతో ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండిని ప్రత్యక్షంగా కలిసి ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా తల్లి లేని పిల్లలకు ఆసరాగా ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వారి కుటుంబానికి భవిష్యత్తుకు బాటగా ఏపీ ఎస్పీడీసీఎల్ లో ఉద్యోగం కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా దివంగత హైమ రాజు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ఆర్ కె రోజా వారి కుటుంబం మీద చూపించిన ప్రేమానురాగాలకు వారికి వర్ణించడానికి మాటలు రాక ఆనందభాష్పాలతో ఎమ్మెల్యే ఆర్ కె రోజాని గట్టిగా హత్తుకొని వారి యొక్క ప్రేమను చాటుకున్నారు. ఏ ఎమ్ మౌనిక స్పందిస్తూ ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు చూపించిన ప్రేమకు నా తల్లి యొక్క ఆత్మకు శాంతి కలిగిందని…. వారు నాకు అందించిన బాధ్యతయోగ్యమైన ఉద్యోగంలో పని చేసి నా తల్లి దివంగత హైమ రాజుకి, తల్లిలా ఆదరించిన ఎమ్మెల్యే ఆర్ కే రోజా అమ్మగారికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా నా బాధ్యతను నిర్వహిస్తానని ఆనందభాష్పాలుతో తెలిపింది.