పొన్నవరం: విజయవాడ ఎమ్మెల్యే సుజనా చౌదరి శుక్రవారం సొంత ఊరు పొన్నవరం విచ్చేశారు. .పొన్నవరం శివాలయం లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మవారి మహాలక్ష్మి అవతారాన్ని దర్శించుకున్నారు. దేవి నవరాత్రులను పురస్కరించుకొని కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆకాంక్షించారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడారు. వారి నుంచి ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు.