Suryaa.co.in

Andhra Pradesh

జొన్నాడ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులపై ఎమ్మెల్యే సమీక్ష

– జాతీయ రహదారిపై ప్రయాణికుల ఇక్కట్లు తీర్చాలని అధికారులకు ఆదేశాలు…
– గుత్తేదారులపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే…
– బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన హైవే సిబ్బంది పై ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆగ్రహం…

కొత్తపేట: నియోజకవర్గంలోని ఆలమూరు మండలం జొన్నాడ వద్ద నిర్మాణం చేపట్టిన ఫ్లై ఓవర్ పనులుపై జాతీయ రహదారి అధికారులతో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమీక్ష నిర్వహించారు.
ఫ్లై ఓవర్ వద్ద ఏర్పాటు చేసిన రాష్ట్ర తెలుగురైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ,తెలుగు యువత జిల్లా అధ్యక్షులు చిలువూరి సతీష్ రాజు పాల్గొన్న ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జాప్యం లేకుండా పూర్తి చేయాలని,ఈ నిర్మాణానికి ఇరు వైపులా రోడ్డు గోతులమయం అవ్వడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

సమస్యను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రయాణికుల ఇక్కట్లు తక్షణం తీర్చాలని ఆదేశించారు.ఫ్లై ఓవర్ నిర్మాణం జాప్యానికి కారణాలు తెలుసుకున్న ఆయన గుత్తేదారు సంస్థ పట్ల అసహనం వ్యక్తంచేశారు.అవసరమైతే యాజమాన్యంతో నేరుగా మాట్లాడతానని ఇచ్చిన సమయానికి వచ్చే మార్చి నాటికి పనులు మాత్రం పూర్తి చేయాలని ఆదేశించారు.

అనంతరం హైవే అధికారులతో కలసి రావులపాలెం మీదుగా టోల్ గేట్ వరకు రహదారిని పరిశీలించారు.రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా చేపట్టిన సర్వీస్ రోడ్డుకు ఆటంకాలు లేకుండా చూస్తామని ఆ రోడ్డును పూర్తి చేయాలని సూచించారు.రావులపాలెం బస్ స్టేషన్ వద్ద డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు.అలాగే అరటి మార్కెట్ చిన్నపాటి వర్షానికి మునుగుతుందని సమస్యను పరిష్కరించేందుకు డ్రైనేజీ ఏర్పాటు చేయాలని హైవే అధికారులను ఆదేశించారు.

కక్ష సాధించే విధంగా కొంత మంది వ్యాపారుల దుకాణాల వద్ద బోర్డులను తొలగించడం తగదని హెచ్చరించారు.తరచూ విభేదాలకు నెలవుగా మారిన టోల్ గేట్ సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ప్రతీ టోల్ గేట్ వద్ద ప్రోటోకాల్ వాహనాలకు ప్రత్యేక మార్గం ఉన్నట్టే ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని హైవే అధికారులకు సూచించారు.

హైవే సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం

రావులపాలెం అరటి మార్కెట్ వద్ద చిరు వ్యాపారులను ఇబ్బందులు పెడుతున్నారని తమ గోడును విన్నవించుకుంటున్న బాధితులపై హైవే సిబ్బంది దురుసుగా మాట్లాడటంతో ఎమ్మెల్యే కలుగజేసుకుని ఆగ్రహం వ్యక్తంచేశారు.ప్రజా ప్రతినిధులు,,ఉద్యోగులు ప్రజా సేవకులని వారి సమస్యను పరిష్కరించాలే తప్ప వారిపై దురుసుగా ప్రవర్తించడం తగదని హైవే సిబ్బందిని ఎమ్మెల్యే సత్యానందరావు హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో గుత్తుల పట్టాభి రామయ్య,అయినవిల్లి సత్తిబాబు గౌడ్,కాస సాగర్,మైగపుల గురవయ్య నాయుడు,గొడవర్తి బాబీ, తాడి శ్రీనివాస్ రెడ్డి,నల్లబాబు, చింతలపూడి శ్రీను మరియు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE