– కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి
అధిక వర్షాలు, వానలతో రాష్ట్రం అతలకుతం అవుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల కోసం ఢిల్లీలో కాలక్షేపం చేస్తున్నారు. కేంద్ర విపత్తు సహాయ నిధి నుండి తగిన ఆర్థిక సహాయాన్ని పొందే హక్కు వున్నప్పటికీ, ఆ మేరకు కేంద్రం నుండి సహాయాన్ని, సహకారాన్ని పొందటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలం చెందారు. ఇట్టి వైఫల్యంతో ముఖ్యమంత్రి తన పదవిలో వుండే హక్కును కోల్పోయారు అని చెప్పక తప్పదు. రాష్ట్రంలో పాలన అలసత్వం, అసమర్ధతకు తార్కాణం.
గత 8 స.లుగా బిజెపి ప్రభుత్వంతో అంటకాగిన తరువాత కేసీఆర్ కి ఇప్పుడు ఐ. టి. ఐ.అర్. ప్రాజక్ట్ గుర్తుకు రావడం హాస్యాస్పదంగా వుంది. ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు విషయంలో కేంద్రం ప్రభుత్వం రద్దు చేస్తోందని కెటిఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారు.గత 8 స.పాలన లో బిజెపి తో సన్నిహితంగా మెలగినప్పుడు ఆయనకు గుర్తు రాలేదా అని సూటిగా ప్రశ్నిస్తున్న. ఐ.టి. ఐ.ఆర్ ప్రాజక్ట్ సాధనలో విఫలం అయ్యి, అనేక మంది రాష్ట్ర యువత కు ఉద్యోగ అవకాశాలను కల్పించే విషయంలో టి.అర్.యస్. ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యింది.
కాళేశ్వరం ప్రాజక్ట్ కు జాతీయ హోదా ను సాధించడంలో, టి.అర్. యస్. ప్రభుత్వం కావాలనే అలసత్వం చూపింది. ఎందుకంటే జాతీయ హోదా కలిగితే సదరు ప్రాజక్ట్ కేంద్ర పర్యవేక్షణకు వెళుతుంది. అప్పుడు కమిషన్లు, అవినీతి కి పాల్పడే ఆస్కారం టి.అర్ యస్. నేతలకు ఉండదు. ప్రస్తుత వరదలు వర్షాలు కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆడుకోవడానికి తక్షణం చర్యలు చేపట్టాలి.
అందులో భాగంగా యెకరానికి 20 వేల రు. చొప్పున. మరియు ఇన్పుట్ సబ్సిడీ గన్10 వేలు చెల్లించాలి. అదే విధంగా ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు 90 వేల చొప్పున. శాశ్వత గృహాలను నిర్మించాలి. రెవిన్యూ శాఖ విపత్తుల నిర్వహణ చట్టం G.o.Ms. No. 2/ 2015 కింద నష్టపరిహారాన్ని చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకోవాలి.